
అంతేకాకుండా చాలామంది సెలబ్రిటీలు కూడా ఈ సినిమా చూడడానికి మక్కువ చూపుతున్నారు. ఇప్పుడు తాజాగా కాంతార చాప్టర్ 1 సినిమా చూడడానికి తమిళంలో స్టార్ డైరెక్టర్ గా పేరు పొందిన అట్లీ ఏకంగా 150 కిలోమీటర్ల పాటు ప్రయాణం చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే అట్లి పికిల్ బాల్ జట్టు బెంగళూరుజవాన్స్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. తన జట్టు మొదటిసారిగా ఓపెన్ టోర్నమెంట్ ప్రారంభం నిన్నటి రోజున జరగా ఈవెంట్ కి అట్లీ వెళ్ళగా అక్కడ మీడియాతో మాట్లాడారు.
అట్లీ మాట్లాడుతూ కాంతార చాప్టర్ 1 సినిమా విడుదలైనప్పుడు తాను అంష్ట్రడాంలో ఉన్నాను.. ఈ సినిమా చూడడానికి సుమారుగా తాను 2.5 గంటల ప్రయాణంలో 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించానని. ఈ సినిమా చూసిన వెంటనే తాను మొదట హీరో రిషబ్ శెట్టి కి ఫోన్ చేశాను ఒక డైరెక్టర్ గా ,హీరోగా రిషబ్ శెట్టి అద్భుతంగా నటించారని ఆయన ఫిలిమ్ మేకింగ్ కూడా ఎందరికో ఆదర్శం, కాంతారను రిషబ్ శెట్టి చాలా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు జాతీయ అవార్డు గెలవాలని తాను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అంటూ తెలిపారు. అట్లీ మాటలు విన్న తర్వాత రిషబ్ శెట్టి అభిమానులు, సోషల్ మీడియా నేటిజన్స్ సక్సెస్ అంటే ఇదేనేమో సినిమా చూడడానికి స్టార్ డైరెక్టర్ అట్లీ కూడా 150 కిలోమీటర్లు ప్రయాణం చేశారు. ఇంతకంటే ఇంకేముంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.