బిగ్‌బాస్ షోను రోజు ఫాలో అవుతున్న ప్రేక్షకులకు ఈ విషయం బాగా తెలిసినదే .  ఈ సీజన్‌లో మరో సెన్సేషనల్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీగా దివ్వల మాధురి (ప్రస్తుతం దువ్వాడ మాధురి) బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది. ఆమె ఎంట్రీతో సోషల్ మీడియాలో మాటల మంటలు ఎగిసి పడుతున్నాయి. ఇప్పటికే “దువ్వాడ మాధురి” అనే పేరు సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.  ముగ్గురు పిల్లల తల్లి అయిన తర్వాత కూడా దువ్వాడ శ్రీనివాస్‌తో రిలేషన్‌షిప్ కొనసాగిస్తూ తరచూ వార్తల్లో నిలిచిన ఆమె ఇప్పుడు బిగ్‌బాస్ స్టేజ్ మీద మరింత హాట్ టాపిక్‌గా మారింది. మాధురి ఇప్పటికే తన  పేరును కూడా దువ్వాడ మాధురిగా మార్చుకుంది. ఆమె బిగ్‌బాస్ ఇంట్లోకి అడుగు పెట్టే ముందు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఆ వీడియోలో మాధురి మాట్లాడుతూ — “నా గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. నేను ఎప్పుడూ నేరుగా మాట్లాడే వ్యక్తిని. అందుకే చాలామంది నన్ను ‘ఫైర్ బ్రాండ్’ అంటారు. నాకు చిన్న వయసులోనే పెళ్లి చేశారు. నాకు ముగ్గురు కూతుళ్లు — ఆరాధ్య, అర్హ, అఖిల. వాళ్లే నా ప్రాణం, నా ప్రపంచం. కానీ నా వివాహ జీవితం అంత సాఫీగా సాగలేదు. నేను, నా భర్త మధ్య ఎప్పుడూ విభేదాలే. ఎన్నిసార్లు సర్దుకుపోవాలని ప్రయత్నించాను. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. చివరికి విడాకులు తీసుకున్నాను,” అని చెప్పింది.



ఆమె ఇంకా చెబుతూ —“ఆ సమయంలోనే కుటుంబ సమస్యలతో బాధపడుతున్న శ్రీనివాస్ గారిని కలిశాను. ఆయనతో మాటలు కలిశాయి, ఆ తర్వాత మా జర్నీ మొదలైంది. మాధురి అంటే శ్రీనివాస్, శ్రీనివాస్ అంటే మాధురి అని చెప్పుకునేంత బంధం ఏర్పడింది. గత నాలుగేళ్లుగా మేము కలిసి జీవిస్తున్నాం. ఈ నాలుగేళ్లలో నేను అనుభవించని నరకం లేదు. సోషల్ మీడియాలో నాపై చాలా దారుణంగా ట్రోల్స్ చేశారు. నా పిల్లలపైనా అసభ్యకరమైన కామెంట్లు చేశారు. ఆ బాధ నాలో కోపాన్ని, ధైర్యాన్ని కలిగించింది. నన్ను ఎగతాళి చేసిన వారికి నేనెవరో చూపించాలనే కోరిక కలిగింది. ఇప్పుడు మీరు బిగ్‌బాస్ హౌస్‌లో చూడబోతున్నది దువ్వాడ మాధురి 2.0! అర్థమైందా రాజా?” అంటూ వీడియోలో స్పష్టంగా చెప్పింది.


ఇంతటితో ఆగకుండా, నాగార్జున ఎదురుగా కూడా మాధురి తన భావాలను స్పష్టంగా వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ —“సమాజమంతా ఒక వైపే నిలబడితే, నేను ఒంటరిగా మరో వైపే నిలబడినాను. ఎందుకంటే నా జీవితం నాది. నాకు నచ్చింది చేస్తాను. పక్కవాళ్లకు నచ్చడం నా బాధ్యత కాదు. నన్ను విమర్శించిన వారిలో దాదాపు 80% మంది ఇప్పుడు నన్ను అర్థం చేసుకున్నారు. మిగతా 20% మందికి కూడా నేనేంటో చూపించాలనుకున్నాను. అందుకే బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చాను. నా లైఫ్ శ్రీనివాస్ గారితోనే ముడిపడింది. ఆయన ‘వద్దు’ అని ఉంటే  నేను ఇక్కడికి వచ్చేదాన్నినే కాదు.  ఆయనే నాకు ఈ నిర్ణయం తీసుకోమన్నారు. అందుకే వచ్చాను,” అని  సెన్సేషనల్ కామెంట్స్ చేసింది.



ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు ఆమె ధైర్యం, స్పష్టతను ప్రశంసిస్తుండగా, మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ ఏది ఏమైనా, దువ్వాడ మాధురి ఎంట్రీతో బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది అన్నది మాత్రం నిజం.

మరింత సమాచారం తెలుసుకోండి: