
ఈ టైటిల్ వినగానేనే మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహం తారాస్థాయిలోకి వెళ్లిపోయింది. ఈ చిత్రంలో సౌత్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.అయితే ఈ సినిమా పూర్తయిన వెంటనే చిరంజీవి మరో మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌కి కమిట్ అయినట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో బలమైన టాక్ వినిపిస్తోంది. బాబీ గతంలో “వాల్తేరు వీరయ్య” సినిమాతో చిరంజీవి – రవితేజ కాంబినేషన్‌లో భారీ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి చిరంజీవి – బాబీ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
ఇక ఈ కొత్త సినిమా మల్టీస్టారర్ కానున్నదనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చిరంజీవితో పాటు ఈసారి కూడా మరో పెద్ద స్టార్ హీరో నటించబోతున్నారని టాక్. కొందరి సమాచారం ప్రకారం, మోహన్‌లాల్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారట! “మెగాస్టార్ చిరంజీవి – మోహన్‌లాల్ కాంబినేషన్” వస్తుందనే రూమర్ వినగానే సౌత్ మొత్తానికి హైప్ చేకూరింది.అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. బాబీ – చిరంజీవి కాంబినేషన్‌కి ఎప్పుడూ భారీ అంచనాలు ఉంటాయి కాబట్టి ఈ వార్త నిజమైతే టాలీవుడ్ బాక్సాఫీస్‌పై సునామీ లాంటి ప్రభావం చూపడం ఖాయం.ప్రస్తుతం మెగా అభిమానులు సోషల్ మీడియాలో “చిరంజీవి కొత్త ట్రెండ్ రాబోతుంది”, “మల్టీస్టారర్ మేనియా తిరిగి మొదలవుతుంది” అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో ఫుల్ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టీ బాబీ నుండి వచ్చే అధికారిక అప్‌డేట్ పైనే ఉంది.చూడాలి మరి, ఈ సారి మెగాస్టార్ మళ్ళీ ఏ రేంజ్‌లో దుమ్ము రేపుతాడో!