
మౌళి మరియు శివాని నగరం జంటగా నటించిన ఈ చిత్రం అంచనాలను మించి బాక్సాఫీస్ వద్ద ఏకంగా 45 కోట్లకు పైగా గ్రోస్ కలెక్షన్స్ సాధించింది . ఇక దీంతో సాయి మార్థాన్ పేరు ఇండస్ట్రీలో మారుమోగుతుందని చెప్పుకోవచ్చు . ప్రజెంట్ ఈ డైరెక్టర్ నెక్స్ట్ ఎటువంటి మూవీస్ చేయనున్నాడు అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు . ఇక ఇందులో భాగంగానే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . సాయి మార్థాన్ని మాట్లాడుతూ .. " నాకు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే ఎంతో అభిమానం .
ఏదో ఒక రోజు ఆయనతో సినిమా చేయడం నా కల . ఒకవేళ అవసరం వస్తే మహేష్ బాబుతో పక్కా ప్రేమ కథ చిత్రం చేయాలని ఉంది . అదికూడా ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలకు భిన్నంగా మరియు కొత్త నేపథ్యం మీద సాగేలా చేయాలనుకుంటున్నాను " అంటూ తెలిపాడు ఈ డైరెక్టర్ . ప్రజెంట్ సాయి మార్థాన్ రెండు కొత్త సినిమాలపై పని చేస్తున్నాడు . అందులో ఒకటి త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది కూడా . ఇక ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే ఈ డైరెక్టర్ కి ఇక ఎదురే ఉండదని చెప్పుకోవచ్చు.