
శింబు నటిస్తున్న కొత్త చిత్రం, దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "అసురన్"..తెలుగులో "సామ్రాజ్యం" ..గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. తాజాగా ఈ తెలుగు వెర్షన్‌కి సంబంధించిన ప్రోమో వీడియోను జూనియర్ ఎన్టీఆర్ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, చిత్ర బృందానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రోమో మొత్తం సుమారు 4 నిమిషాల నిడివితో ఉంది. ఉత్తర చెన్నై నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ జీవితం, ప్రతీకారం, రాజకీయాలు వంటి అంశాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. శింబు పాత్రను చాలా రా అండ్ రియలిస్టిక్‌గా చూపించారు. హత్య కేసులో ఇరుక్కున్న హీరో కోర్టు ముందు "నేను నిర్దోషిని" అని చెప్పే సన్నివేశం నుంచి, క్రూరమైన గ్యాంగ్ వార్ సీన్స్ వరకు — మొత్తం ప్రోమోలో సింబు కొత్త లుక్, డైలాగ్ డెలివరీ, అనిరుద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ — అన్నీ కలిపి వేరే లెవెల్ అనిపించాయి. అయితే ఈ ప్రోమో చివరలో శింబు చెప్పిన ఒక డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.“నా స్టోరీని ఎవరితో చెప్పించాలనుకుంటున్నారు? ఎన్టీఆర్‌తో చెప్పించండి... కుమ్మిపడదొబ్బుతాడు!”ఈ డైలాగ్ విన్న వెంటనే ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో ఫుల్ జోష్‌లోకి వచ్చారు. "ఇదే రా ఎన్టీఆర్ స్టైల్!", "దానికి ntr నే కరెక్ట్!" అంటూ హ్యాష్‌ట్యాగ్‌లతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.
కానీ మరోవైపు కొంతమంది నెటిజన్లు మాత్రం ఈ డైలాగ్‌ను కావాలనే వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది ఇలా అంటున్నారు — “శింబు కావాలనే ఈ డైలాగ్ ద్వారా ఎన్టీఆర్ యాంటి అభిమానులను రెచ్చగొట్టాడా?” అని అంటున్నారు. అయితే వాస్తవానికి, ఆ డైలాగ్ సినిమా కాంటెక్స్ట్‌లో చెప్పినదే.. ఇక ఎన్టీఆర్ అభిమానులు మాత్రం ఈ డైలాగ్‌ని పాజిటివ్‌గా తీసుకుంటూ,“ఇండస్ట్రీలో స్టార్లలో స్టార్ ఎన్టీఆర్ మాత్రమే. దానికి పర్ఫెక్ట్ కట్ అవుట్ ఇతడే!”అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు. ఇక శింబు విషయానికి వస్తే, ఆయన చెప్పిన ప్రతి డైలాగ్ రియలిస్టిక్ టచ్‌లో ఉండటంతో, ప్రేక్షకులు ఆయన యాక్టింగ్‌ని, ఎనర్జీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆయన చెప్పిన మాటల్లో ఉన్న పవర్, ఆ యాటిట్యూడ్ — మొత్తం కలిపి సినిమా మీద భారీ అంచనాలు పెంచేశాయి.ఇప్పటికే #Simbu #NTR #Samarajyam అనే హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ శింబు – ఎన్టీఆర్ కనెక్షన్ సోషల్ మీడియాలో కొత్త హైప్‌ని సృష్టించింది. ఇప్పుడు అందరి దృష్టి సినిమా రిలీజ్ వైపు మళ్లింది.