తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎవరైనా స్టార్ హీరో పేరు వినగానే అభిమానులు కేరింతలు కొడతారు. కానీ “జూనియర్ ఎన్టీఆర్” పేరు వినిపిస్తే మాత్రం ఆ ఉత్సాహం, ఆ శబ్దం మరీ వేరే రేంజ్‌లో ఉంటుంది. ఎన్టీఆర్ అంటే మాస్, క్లాస్, స్టైల్ – ఇవన్నీ కలిసిన ఎనర్జీ ప్యాక్. ప్రస్తుతం ఆయన దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) చిత్ర షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే “మురుగన్” అనే భారీ ప్రాజెక్ట్‌కి కమిట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక ఫేక్ రూమర్ హద్దులు దాటిపోయేలా వైరల్ అవుతోంది. ఆ రూమర్ ప్రకారం – “జూనియర్ ఎన్టీఆర్ ఇకపై కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర 2’ సినిమా చేయరని, ఆయన పూర్తి గా ఆ కాల్షీట్స్‌ను త్రివిక్రమ్ మురుగన్ సినిమాకే కేటాయించారని” అంటూ పోస్టులు విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఇంతే కాదు, “దేవర 2 సినిమా మినిమమ్ రెండు సంవత్సరాలు వాయిదా పడే అవకాశం ఉంది” అని కూడా కొందరు వదంతులు పుట్టిస్తున్నారు. ఇక ఈ వార్తలతో నందమూరి అభిమానులు మాత్రం తీవ్ర ఆగ్రహంతో సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. “ఇవి పూర్తిగా ఫేక్ వార్తలు. ఎన్టీఆర్ గురించి ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు. దేవర 2 ప్రాజెక్ట్‌కి ఎలాంటి సమస్యలు లేవు, షూట్ ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతుంది” అంటూ స్పష్టంగా చెబుతున్నారు.

సినీ వర్గాల సమాచారం ప్రకారం కూడా, ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదట. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర 2 ’ వస్తుంది. రెండో పార్ట్ కోసం ఎన్టీఆర్, కొరటాల ఇద్దరూ ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తున్నారు. షూటింగ్ షెడ్యూల్‌పై చర్చలు జరుగుతున్నప్పటికీ, ప్రాజెక్ట్ ఆగిపోతోందని చెప్పడం పూర్తిగా అసత్యం. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం నిజమే అయినప్పటికీ, అది దేవర 2 తర్వాతే మొదలవుతుందని సమీప వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న కొత్త యాక్షన్ ఎంటర్టైనర్‌లో ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించబోతున్నాడు. ఆ లుక్‌ని త్రివిక్రమ్ సినిమా కోసం కూడా ఉపయోగిస్తారనే ప్రచారం కూడా అంతా కల్పితమే అని తెలుస్తోంది.

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం టాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోల్లో ఒకరు. ఆయన ప్రతి సినిమాకు భారీ స్థాయిలో ప్లానింగ్ జరుగుతుంది. అలాంటి స్టార్ ప్రాజెక్ట్‌ల గురించి ఇలా తప్పుడు రూమర్లు సృష్టించడం అభిమానులను మాత్రమే కాకుండా, చిత్ర బృందాన్ని కూడా ఇబ్బందులకు గురిచేస్తోంది. ”ఇలా ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో #FakeNewsOnNTR అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆ రూమర్‌లకు కౌంటర్ ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: