టాలీవుడ్‌లో ఈ మధ్యకాలంలో అత్యంత చర్చనీయాంశం అవుతున్న పేరు — సందీప్ రెడ్డి వంగ. ఆయన సినిమాలంటే ఒక మ్యాడ్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఒక సెన్సేషన్ లాంటిది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సినిమాలతో ఆయనకు క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ప్రతి సినిమా తర్వాత కూడా ఆయన పేరు చుట్టూ ఒక సైకో ఫ్యాన్ లెవెల్ హైప్ నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్ ఏంటంటే — పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కబోయే స్పిరిట్! ఇప్పటికే ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కల్కి 2,సలార్ 2, రాజా సాబ్, ఫౌజి ఇంకా కొన్ని అనౌన్స్ కాని భారీ ప్రాజెక్టులతో ఆయన షెడ్యూల్ టైట్‌గా ఉంది. అయితే ఈ బిజీ షెడ్యూల్ మధ్యలోనే సందీప్ రెడ్డి వంగ తనదైన స్టైల్లో ఒక కండీషన్ పెట్టాడట.

ఇండస్ట్రీ టాక్ ప్రకారం, స్పిరిట్ సినిమా షూట్‌ను కేవలం 100 రోజుల్లో పూర్తి చేయాలని సందీప్ ఫిక్స్ అయ్యాడట. ఇందుకోసం ఆయన ప్రభాస్‌కి బ్యాక్ టు బ్యాక్ 100 కాల్‌షీట్లు ఇవ్వాలని అడుగుతున్నారట. అంటే, ఒకసారి సెట్లోకి అడుగు పెట్టిన తర్వాత కాంటిన్యూగా వంద రోజులపాటు షూట్ చేసి సినిమా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారట ! కానీ ఇక్కడే బిగ్ ప్రాబ్లమ్. ప్రభాస్ ఇప్పటికే వేరే సినిమాలకు కూడా డేట్స్ ఇచ్చేసారు. అలా ఉండగా ఈ 100 డేస్ కండీషన్‌ని ఫాలో అవ్వడం చాలా కష్టం. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద చర్చ ఏంటంటే — “ప్రభాస్ ఈ కండీషన్‌ని అంగీకరిస్తాడా..? లేక తన స్టైల్లో షెడ్యూల్‌ని మార్చుకుంటాడా..?” అన్నది.

మరి మరోవైపు, సందీప్ రెడ్డి వంగకు దగ్గర ఉన్నవారు చెబుతున్న మాట ఏమిటంటే — “ఈ కథ ఒక రేంజ్‌లో ఉంటుంది, ప్రభాస్‌కి కొత్త ఇమేజ్‌ని తీసుకువస్తుంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ లుక్స్, కాంటిన్యుయిటీ కోసం ఈ కండీషన్ తప్పనిసరి.” అని అంటున్నారు..ప్రభాస్ మాత్రం వేరే ఆలోచనలో ఉన్నాడట. ఒకవైపు ఆయన సినిమాల పట్ల ఉన్న డెడికేషన్, మరోవైపు ఇతర కమిట్మెంట్లు — ఈ రెండింటి మధ్య ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం — స్పిరిట్ అనే టైటిల్‌కే తగినట్టుగా ఈ సినిమా కూడా ఆ రేంజ్ ని కదిలించే స్థాయిలో ఉండబోతోందట. టాలీవుడ్ అంతా ఇప్పుడు ఎదురుచూస్తోంది — “ప్రభాస్ ఈ వంద రోజుల కండీషన్‌కి ఓకే చెబుతాడా..? లేక మళ్లీ షెడ్యూల్ మార్చేస్తాడా..?” అన్న సమాధానం కోసం. ఏది ఏమైనా, సందీప్ రెడ్డి వంగ – ప్రభాస్ కాంబినేషన్ అనగానే బాక్సాఫీస్‌లో రికార్డుల తుఫాన్ ఖాయమని మాత్రం అభిమానులు నమ్ముతున్నారు!


మరింత సమాచారం తెలుసుకోండి: