
ముఖ్యంగా హీరో తేజ సజ్జపై ఆయన చేసిన ప్రశంసలు అందరినీ ఆకట్టుకున్నాయి. “నువ్వు ఇండస్ట్రీకి నెక్స్ట్ ఐకాన్ అవుతావు. భవిష్యత్తులో అల్లు అర్జున్ లెవెల్‌కి ఎదుగుతావ్” అంటూ బండ్ల గణేష్ తేజ సజ్జను ప్రశంసలతో ముంచెత్తారు. ఈ మాటలు ఇప్పుడు యువ హీరో తేజ లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అయితే, ఈ వేడుకలో మరో ముఖ్య ఘట్టం మెగాస్టార్ చిరంజీవి హాజరైన సందర్భం. చిరంజీవి .. బండ్ల గణేష్ ఇంటికి రావడం అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో హడావుడిని రేపింది. ఆ సందర్భంలో బండ్ల గణేష్ మెగాస్టార్‌కు ప్రత్యేక సింహాసనం సిద్ధం చేసి మర్యాదపూర్వకంగా కూర్చోబెట్టారు.
తర్వాత ఆయన సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు —“మా బాస్ చిరంజీవి గారు మా ఇంటికి వస్తున్నారని తెలిసిన క్షణం నుండి నా ఆనందానికి హద్దులు లేకపోయాయి. ఆయనపై ఉన్న ప్రేమతోనే ఆయన కోసం ప్రత్యేకంగా ఒక సింహాసనం తయారు చేయించాను. ఆయన ఆ సింహాసనంలో కూర్చున్న క్షణం నా జీవితంలో మరపురాని అనుభవం,” అని బండ్ల గణేష్ ఎమోషనల్‌గా రాశారు.ఈ పోస్ట్ కేవలం కొన్ని సెకండ్లలోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే నెటిజన్లు ప్రతిస్పందనలు రెండు రకాలుగా వచ్చాయి.
కొంతమంది అభిమానులు బండ్ల గణేష్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ — “ఇంత ప్రేమ, ఇంత గౌరవం చూపడం నిజంగా గొప్ప విషయం” అని కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, కొంతమంది మాత్రం ట్రోల్ మోడ్‌లోకి వెళ్లి, “నీవు చూపిస్తున్న ప్రేమ అతి, ఓవరాక్షన్ ఎక్కువ అయింది”, “మెగా హీరోలు అంటే నీకు ఎందుకంత మోజు?” అంటూ ఘాటు కామెంట్లు చేస్తున్నారు. అదే సమయంలో సోషల్ మీడియాలో “క్రీమ్ బిస్కెట్ వేస్తున్నావా” అనే కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. చిరంజీవిని గౌరవించేందుకు సింహాసనం ఏర్పాటు చేసినందుకు కొందరు “క్రీమ్ బిస్కెట్ వేసేశాడు” అంటూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు.