
ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి వచ్చిన ఇద్దరి పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలోనే లవ్ విషయాలపైన హీరో రామ్ స్పందించారు. తాజాగా జగపతిబాబు చేస్తున్న ఒక టాక్ షోలో గెస్ట్ గా వచ్చిన రామ్ కు అపార్ట్మెంట్లో సోలాగా ఉంటున్న ఏమైనా ఎఫైర్స్ ఉన్నాయా అంటూ ప్రశ్నించగా?.. అందుకు హీరో రామ్ మాట్లాడుతూ.. నా లైఫ్ అంతా కూడా రామ్ అలా అంటాడంట, అలా చేశాడంట అంటూనే వెళుతుందంటూ తెలియజేశారు.
ఇక రిలేషన్షిప్ విషయానికి వస్తే తాను ఎప్పుడూ గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతానని.. ఆది పర్సనల్ అని తెలిపారు. అలాగే భాగ్యశ్రీ కేవలం హీరోయిన్ మాత్రమే లేకపోతే ఇంకేమైనా అంటూ మరొక ప్రశ్న వేయగా.. ఈ ప్రశ్నకు హీరో రామ్ కేవలం నవ్వుతూ సైలెంట్ అయ్యారు. దీన్నిబట్టి చూస్తే హీరో రామ్, భాగ్యశ్రీ లవ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటూ రామ్ అభిమానులతో పాటు పలువురు నేటిజన్స్ కూడా ఈ విషయంపై కామెంట్స్ చేస్తున్నారు. లవర్ బాయ్ రామ్, రోజ్ బ్యూటీ భాగ్యశ్రీ జంట చూడముచ్చటగా ఉంటుందంటు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయం పైన హీరోయిన్ భాగ్యశ్రీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.