ప్రభాస్ — ఈ పేరు వినగానే అభిమానుల గుండెల్లో ఒక ఉత్సాహం పుడుతుంది, చప్పట్లు, అరుపులు, కేకలు ఎక్కడికక్కడ మారుమ్రోగుతాయి. ఆయనను ఒక హీరోగా కాకుండా, ఒక దేవుడిలా భావించే స్థాయికి అభిమానులు చేర్చారు. కానీ ఈ స్థాయికి ప్రభాస్ ఒక్కరోజులో రాలేదు. ఆయన ప్రయాణం కష్టాలతో, సవాళ్లతో, త్యాగాలతో నిండిపోయింది.ప్రభాస్‌ కెరీర్‌ ప్రారంభం చాలా సాధారణంగా జరిగింది. ఆయన మొదటి సినిమా “ఈశ్వర్” రిలీజ్‌ అయినప్పుడు, పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. “రెబల్ స్టార్ కృష్ణంరాజు రిలేటివ్” అంటూ మాత్రమే ఆయన గురించి మాట్లాడుకున్నారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారాయి. “వర్షం”, “చత్రపతి”, వంటి సినిమాలు విడుదలయ్యాక, ప్రభాస్ పేరు ప్రతి ఇంట్లో వినిపించేలా మారింది. ఆ సినిమాలతో ఆయన సూపర్‌స్టార్‌గా ఎదిగారు.ప్రభాస్‌ విజయానికి వెనుక ఎన్నో ఫెయిల్యూర్లు ఉన్నాయి. మొదటి కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితం ఇవ్వకపోయినా ఆయన ఆగలేదు, నిరుత్సాహపడలేదు. కొందరు ఆయన ముఖం చూసి “ఇది హీరో ముఖమా?” అని ఎగతాళి చేసినా, ప్రభాస్ మాత్రం “మాటల్లో కాదు, మన పనితో సమాధానం ఇవ్వాలి” అనే తత్వంతో ముందుకు సాగారు. అదే ఆయన విజయం వెనుక ఉన్న నిజమైన బలం.

ప్రభాస్‌ ఎత్తు చూసి చాలా మంది “ఇంత పొడవున్నోడు సినిమాల్లో ఏం చేస్తాడు?” అని అనేవారు. కానీ ఆయన సినిమాలోకి వచ్చిన తర్వాత అదే ఎత్తు ఆయనకు ఒక పెద్ద ఆస్తిగా మారింది. ఇప్పుడు ఆరు అడుగుల ప్రభాస్ అంటే ఫ్యాన్స్ కి గర్వకారణం. ఆయన “భయ్యా”, “బ్రదర్” అని పిలవబడటానికి ఇబ్బంది పడకుండా, అందరినీ “డార్లింగ్” అంటూ పిలిచి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించారు.ప్రభాస్ లో మరో ప్రత్యేకత ఏమిటంటే — ఆయన చాలా సిగ్గుపడే వ్యక్తి. బయటకు పెద్దగా మాట్లాడకపోయినా, కెమెరా ముందు “యాక్షన్” అనే మాట వినగానే పూర్తిగా మారిపోతారు. ఎదుట ఎవరు ఉన్నా సరే, ఆయన ఆ పాత్రలో పూర్తిగా లీనమైపోతారు. ఇదే ఆయనకు ఉన్న నిజమైన టాలెంట్.

ప్రభాస్‌ కేవలం నటుడే కాదు, మంచి మనిషి కూడా. ఆయన సంపాదించిన దానిలో సగానికి పైగా విరాళంగా ఇస్తారు. సహాయం చేయడం ఆయనకు అలవాటే. “సొంత లాభం కొంత మానుకొని, పొరుగువారికి సాయం చేస్తే దేవుడు ఎప్పుడూ మనపై చల్లగా కరుణిస్తాడు” అనే నమ్మకం ఆయన జీవన విధానం.సినిమాలు చేయని సమయంలో ప్రభాస్ ఎక్కువ సమయం పుస్తకాలతో గడుపుతారు. ఆయన చెప్పినట్టే, పుస్తకాలు మనసుకు శాంతిని, ఆలోచనలకు దారిని ఇస్తాయి. ఇదే ఆయనను మరింత స్థిరమైన వ్యక్తిగా మార్చింది.ప్రభాస్ గురించి సోషల్ మీడియాలో తరచుగా ఫేక్ న్యూస్ వైరల్ అవుతూనే ఉంటుంది. కానీ ఆయన వాటిని పెద్దగా పట్టించుకోరు.  ఆయనను చూసి అభిమానులు నేర్చుకోవాల్సింది — ఓపికగా, దృష్టి సారించి ముందుకెళితే విజయం తప్పదు అనే విషయం.మూడో సినిమా “వర్షం” హిట్ అయ్యాక ప్రభాస్‌ తన విలువను అందరికీ ప్రూవ్‌ చేశారు. ఆయన లైఫ్ మనకు చెప్పే మెసేజ్ చాలా సింపుల్ — “ఫ్లాప్స్, హిట్స్ అనేవి తాత్కాలికం; కానీ కృషి, పట్టుదల శాశ్వతం.”

ఇక ప్రభాస్‌ కెరీర్‌లో పెద్ద మైలురాయి “బాహుబలి”. ఆ సినిమా కోసం ఆయన ఐదేళ్లు తన జీవితాన్ని అర్పించారు. ఆ సమయంలో మరిన్ని సినిమాలు చేసుకుని డబ్బు సంపాదించుకోవచ్చని చాలా మంది చెప్పారు. కానీ ఆయన మాత్రం మిత్రత్వానికి విలువ ఇచ్చి, రాజమౌళి నిర్ణయాన్ని గౌరవించి, ఆ సినిమాకే అంకితమయ్యారు. ఫలితం అందరికీ తెలిసిందే — “బాహుబలి” సినిమా భారతీయ సినీ చరిత్రలో ఒక గోల్డెన్ ఛాప్టర్‌గా నిలిచింది.ఇప్పుడు ప్రభాస్ ఒక్కో సినిమాకి ₹100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. కానీ ఆయనకు డబ్బుకంటే పేరు, అభిమానుల ప్రేమ, గౌరవం ముఖ్యమైనవి. ఆయన జీవితం, ఆయన డెడికేషన్ యువతకు ఒక స్ఫూర్తి.ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ఆయన కెరీర్‌ను, ఆయన కష్టాన్ని, ఆయన మనసును ట్రెండ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ అంటే కేవలం ఒక నటుడు కాదు — ఒక స్పూర్తి, ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిత్వం.ప్రభాస్ మనకు నేర్పిన సందేశం ఒక్కటే “పట్టుదలతో పని చేస్తే విజయం మనకే వస్తుంది. డబ్బు కాదు, మనసును గెలుచుకోండి — అదే నిజమైన స్టార్‌.”


మరింత సమాచారం తెలుసుకోండి: