
కొన్ని సందర్భాల్లో కాషాయ పంచె, షర్టుతో దర్శనమిచ్చినా, ఎక్కువగా ఆయన వైట్ కుర్తాలకే కట్టుబడి ఉన్నారు. అయితే గత రెండు వారాలుగా పవన్ లుక్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సెలూన్ ఓపెనింగ్ కార్యక్రమంలో స్కై బ్లూ టీ షర్ట్, బ్లాక్ షార్ట్, స్పోర్ట్ షూస్, కొత్త హెయిర్ స్టైల్‌తో కనిపించిన పవన్ - ఇప్పుడు మళ్లీ ఆ స్టైలిష్ వైపు అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తున్నారు. బ్లాక్ ప్యాంట్ – వైట్ షర్ట్ కాంబోతో, డార్క్ బ్లూ షర్ట్ – సిమెంట్ కలర్ ప్యాంట్‌తో, అలాగే స్కై బ్లూ షర్ట్ – క్రీమ్ ప్యాంట్ కాంబినేషన్‌లలో ఇటీవల పవన్ కనిపించడంతో అభిమానులు సోషల్ మీడియాలో ‘అన్నయ్య న్యూ స్టైల్ మాసివ్!’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ మార్పు వెనుక అభిమానుల అభ్యర్థనలున్నాయా? లేక పవన్ స్వయంగా తీసుకున్న నిర్ణయమా? అనేది ఇంకా క్లియర్ కాదు.
కానీ పవన్ ఏదైనా చేస్తే దానికి స్టైల్ ఉంటుంది అనేది మాత్రం అంగీకరించాల్సిందే! సాధారణంగా రాజకీయ నాయకులు ఒకే తరహా డ్రెస్సింగ్‌లో స్థిరపడిపోతారు. సీఎం చంద్రబాబు ఖాకీ షర్ట్ – ప్యాంట్‌లతో ఫిక్స్, జగన్ మాత్రం వైట్ షర్ట్ – ఖాకీ ప్యాంట్ స్టైల్‌లో కనిపిస్తారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కువగా బ్లాక్ ప్యాంట్ – వైట్ షర్ట్ లుక్‌కే పరిమితమయ్యారు. కానీ పవన్ మాత్రం ఎవరికీ కాపీ కాదు – ఆయన లుక్ ఆయనదే! సినిమా హీరోగా స్టైలిష్ పవర్ స్టార్, ఇప్పుడు రాజకీయ నాయకుడిగా సింపుల్ కానీ క్లాస్ లుక్‌లో జనాలను ఆకట్టుకుంటున్న పవన్ కల్యాణ్, తన కొత్త లుక్‌తో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు – “స్టైల్ అంటే పవన్ కల్యాణ్!”