దీంతో బండ్ల గణేష్ మళ్లీ నిర్మాతగా మారిపోతున్నాడనే విధంగా వార్తలు వినిపించాయి. టెంపర్ సినిమాతో మంచి సక్సెస్ తీసుకొని బ్రేక్ తీసుకున్న, మళ్లీ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలవుతుంది అంటూ మాట్లాడడంతో బండ్ల గణేష్ రీ ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా మెగా హీరోలతో సినిమా చేయబోతున్నారనే వార్తలు చాలా గట్టిగానే వినిపించాయి. తాజాగా ఈ విషయం పైన బండ్ల గణేష్ రియాక్ట్ అవుతూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.
బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా ఇలా స్పందిస్తూ.. మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక విన్నపం ఏమిటంటే ప్రస్తుతం తాను ఏ సినిమాలను నిర్మించడం లేదని, అలాగే ఎవరితో కూడా తాను సినిమా చేయాలని నిర్ణయం తీసుకోలేదని, దయచేసి ఇలాంటి వార్తలు రాసి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీ అందరి ప్రేమ మద్దతు ఎప్పుడు నాతోనే ఉండాలంటూ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఇంతటితో ఈ విషయానికి పుల్ స్టాప్ పెట్టేయండి అన్నట్టుగా బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. దీన్నిబట్టి చూస్తే బండ్ల గణేష్ ప్రస్తుతం సినిమాలు నిర్మించే అవకాశం లేనట్టుగా కనిపిస్తోంది. ఈ విషయంతో అటు మెగా అభిమానులైతే కొంతమేరకు నిరాశగా కనిపిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి