ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గత కొంత కాలంగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. కానీ ఈయన ఆఖరుగా నటించిన మూడు మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ ల ద్వారా ఈయనకు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఆపజయాలు దక్కాయి. ఈయన కొంత కాలం క్రితం ది వారియర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ అయ్యింది. ఆ తర్వాత ఈయన నటించిన స్కంద , డబల్ ఇస్మార్ట్ మూవీ లు కూడా ఈయనకు అలాంటి ఫలితాలనే బాక్స్ ఆఫీస్ దగ్గర అందించాయి.

ఇక మాస్ కమర్షియల్ మూవీ ల ద్వారా వరుస పెట్టి అపజయాలను అందుకున్న ఈయన ప్రస్తుతం ఆంధ్ర కేక్ తాలూకా అనే సినిమాలో హీరోగా నటించాడు. భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించగా... మహేష్ బాబు పి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఉపేంద్ర ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను నవంబర్ 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను  అంతకు ఒక రోజు ముందు అనగా నవంబర్ 26 వ తేదీనే ఓవర్సీస్ లో ప్రదర్శించనున్నారు.

మూవీ కి సంబంధించిన ఓవర్సీస్ టికెట్ బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మేకర్స్ ఇప్పటికే విడుదల చేశారు. ఇక ఈ మూవీ ఓవర్సీస్ బుకింగ్స్ కి జనాల నుండి ఎలాంటి రెస్పాన్స్ లభిస్తుంది అనేది చూడాలి. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి రామ్ "ఆంధ్ర కింగ్ తాలూకా" సినిమాతో ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులపై చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: