ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్‌లలో ఒకటి రామ్ పోతినేనిఅనిల్ రావిపూడి కాంబినేషన్ గురించి. టాలీవుడ్ సర్కిల్స్‌లో ఈ వార్త మంచి స్థాయిలో వైరల్‌గా మారింది. రామ్ పోతినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా రామ్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా వరుసగా వచ్చిన సినిమాల్లో ఒక్కటీ పెద్ద హిట్‌గా నిలవకపోవడంతో ఆయనపై కొంత నెగిటివ్ వైబ్ కూడా సోషల్ మీడియాలో ఏర్పడింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు వచ్చినప్పటికీ పక్కా బ్లాక్‌బస్టర్ మిస్సవడంతో రామ్ దాదాపు హ్యుజ్ ట్రోలింగ్‌ను కూడా ఫేస్ చేశాడు.


ఇలాంటి సమయంలో వచ్చిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా రామ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. చాలా రోజుల తర్వాత వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ టాక్‌ని సంపాదించుకుంది. రామ్ నటన, ఆయన చూపిన ఎక్స్ప్రెషన్స్, ఎనర్జీ… అన్నీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీనితో రామ్ పోతినేని పై సోషల్ మీడియాలో, ఫిలిం ఇండస్ట్రీలో, సెలబ్రిటీలలో ప్రశంసలు వెల్లువెత్తాయి. రామ్ డెడికేషన్, హార్డ్ వర్క్‌ కి మళ్లీ ఫ్యాన్స్ గొప్పగా స్పందిస్తున్నారు. ఇక ఈ ఆనందకర వాతావరణంలోనే ఇండస్ట్రీలో ఓ కొత్త వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌కి కింగ్‌గా పేరుగాంచిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాను రామ్ పోతినేనితో ఫిక్స్ చేశాడని టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. ‘ఆంధ్ర కింగ్’ చూసిన తర్వాత రామ్ చూపిన ఎక్స్ప్రెషన్స్‌కు, స్క్రీన్ ప్రెజెన్స్‌కు అనిల్ రావిపూడి ఫిదా అయ్యాడని కూడా అంటున్నారు. అనిల్ .. రామ్‌ను సంప్రదించి, సినిమా గురించి కొన్ని పాయింట్లు, కథపై ఉన్న ఆసక్తి లాంటి విషయాలను షేర్ చేశాడన్న టాక్ ఇండస్ట్రీలో స్ట్రాంగ్‌గా వినిపిస్తోంది.



ఈ వార్త ఎంతవరకు నిజమో అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. అభిమానులు ఈ కాంబినేషన్ కోసం చాలా కాలం నుంచి వేచి చూస్తున్నారు. అనిల్ రావిపూడి తీసే ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ సినిమాలు థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకువస్తాయనే నమ్మకం ఉంది. ఇక రామ్ పోతినేని కూడా ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషనల్ కంటెంట్ ఉన్న సినిమాల్లో నటిస్తే అదరగొడతాడని ప్రేక్షకులకు తెలుసు.అందుకే ఈ ఇద్దరి కాంబినేషన్ కుదిరితే సూపర్ డూపర్ హిట్ పక్కా అని ఫ్యాన్స్ భారీగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో చాలా మంది ఈ కాంబినేషన్‌ను ‘పర్ఫెక్ట్ ఎనర్జీ + పర్ఫెక్ట్ కామెడీ & ఫ్యామిలీ ఎమోషన్’ కలయికగా చూస్తున్నారు. అందుకే ఈ ఇద్దరి సినిమా నిజంగా మొదలైతే భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: