అటు థియేటర్లలో విడుదలైన నాలుగు లేదా ఎనిమిది వారాలలోపే సినిమా ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకులకు మంచి ఆనందాన్ని.. ఎంటర్టైన్మెంట్ ను అందిస్తున్న విషయం తెలిసిందే. జానర్ ఏదైనా సరే ఓటీటీలోకి రావాల్సిందే.. అంతలా ప్రతి సినిమా కూడా ఇప్పుడు థియేటర్ తో పాటు ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఇప్పటికే ఎన్నో ఓటీటీ ఫ్లాట్ ఫారమ్స్ మంచి మంచి సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్న క్రమంలో.. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమయ్యింది. అదే రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ మూవీ.


రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంతో పాటు కీలక పాత్ర పోషించిన చిత్రమిది. ఇందులో రష్మిక మందన్న లీడ్ రోల్ పోషించగా.. దీక్షిత్ శెట్టి హీరోగా నటించారు. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అనుఇమ్మానుయేల్ కూడా ఇందులో భాగమవడం గమనార్హం.ఒకవైపు ప్రేమించిన వ్యక్తి.. మరొకవైపు కన్నతండ్రి ప్రేమ.. ఇద్దరి మధ్య నలిగిపోయిన ఒక అమ్మాయి కథగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది.నటనపరంగా ఇందులో రష్మిక ఒదిగిపోయిందని చెప్పాలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈమెకి ఈ సినిమా మరో విజయాన్ని అందించింది.

అలా థియేటర్లలో మంచి సక్సెస్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ కి కూడా సిద్ధం అయ్యింది. నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై సంచలనం సృష్టించిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కి సిద్ధం కానున్నట్లు ఆ ఓటీటీ ప్లాట్ ఫారమ్ నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.  ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా.. ఇటు ఓటీటీ లో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: