హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే బాగా ట్రెండ్ అవుతుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత దాదాపు 4 సంవత్సరాల పాటు సింగిల్ లైఫ్ లో గడిపిన సమంత, రాజ్ నిడిమోరుతో సోమవారం రోజున రెండో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ముందు నుండే వీళ్లు చాలా రొమాంటిక్ ఉన్న పిక్స్ వైరల్ అవుతూ వచ్చాయి. కానీ ఎక్కడ సమంత అఫిషియల్ గా ప్రకటించకపోవడంతో ఇదంతా ఫేక్ అంటూ కొట్టిపడేశారు.


కానీ సడెన్ గా నిన్న వీళ్లు పెళ్లి చేసుకోవడంతో ఇది టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఈ వివాహం చాలా సీక్రెట్ గా, దగ్గరి సన్నిహితుల మధ్య జరిగింది. సమంత రెండో పెళ్లి గురించి సోమవారం సోషల్ మీడియా మొత్తం వార్తలతో నిండిపోయింది. ఆ తరువాత సమంత పిక్స్ షేర్ చేసి కన్ ఫాం చేసింది.  ఈ సందర్భంగా, అక్కినేని నాగచైతన్య షాకింగ్ పోస్ట్ చేశారు. తన కెరీర్, సినిమాల గురించి ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

నాగ చైతన్య నటించిన ధూత సిరీస్ రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టులో నటించిన వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీనితో నాగచైతన్య చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంత పెళ్లి రోజే ఇలా స్పందించడం అవసరమా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు, అయితే కొంతమంది మాత్రం నాగచైతన్య కేవలం దూత కోసం మాత్రమే స్పందించారని విశ్లేషిస్తున్నారు. మరికొంతమంది ఇవాళ్ల నిన్ను బాగా గుర్తు చేసుకున్నాం బ్రో అంటూ కామెంట్స్ చేశారు.


ఇప్పటి వరకు కొంతమంది సమంత రెండో పెళ్లి చేసుకుంటే నాగచైతన్య బాధపడతారని భావించారు. కానీ ఆయన ఏం పట్టించుకోకుండా  “అరటిపండు తోక్కలా” ఆ పెళ్లిని తీసేస్తూ తన సినిమా సిరీస్ ల గురించి మాట్లాడుతున్నారు అంటూ  ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. నిజానికి, విడాకులు తర్వాత ప్రతి ఒక్కరి జీవితం వ్యక్తిగతం. ఇద్దరూ వేర్వేరు జీవితం ప్రారంభించారు. అందుకే, వారిని ట్రోల్ చేయడం మానేయాలన్నది ఎక్కువమంది అభిప్రాయం.



మరింత సమాచారం తెలుసుకోండి: