సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమాను ఎంత బాగా తీశాము అనే దాని కంటే కూడా ఒక సినిమాను ఎంత బాగా ప్రమోట్ చేశామో అనేది ప్రస్తుత కాలం లో చాలా ముఖ్యంగా మారింది. ఒక సినిమాను బాగా తీసి దాని ప్రమోషన్లను అదే స్థాయిలో చేయనట్లయితే సినిమాకు పెద్ద స్థాయిలో కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండదు. దానితో ఈ మధ్య కాలంలో మూవీ బృందాల వారు సినిమాను పూర్తి చేసిన తర్వాత దాని ప్రమోషన్లపై కూడా ఫుల్ కాన్సన్ట్రేషన్ పెడుతూ వస్తున్నారు. ఇకపోతే కొంత కాలం క్రితం సూపర్ స్టార్ రజనీ కాంత్ "కూలీ" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ బృందం వారు డెలవరి పార్సల్స్ పై ఆ సినిమా పోస్టర్లను వేసి ఆ మూవీ ని ప్రమోట్ చేశారు. దానితో ఈ వార్త ఆ సమయంలో తెగ వైరల్ గా మారింది. కూలీ యూనిట్ వారు ఆ సినిమా ప్రమోషన్లను అద్భుతంగా చేస్తున్నారు అని ఈ మూవీ యూనిట్ పై చాలా మంది ప్రశంసల వర్షం కూడా కురిపించారు.

ఇకపోతే రజనీ కాంత్ హీరో గా రూపొందిన కూలీ మూవీ ప్రమోషన్లను బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ 2 సినిమా విషయంలో కూడా ఈ మూవీ బృందం వారు ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ 2 మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే అఖండ 2 మూవీ యూనిట్ వారు కూడా కూడా డెలివరీ పార్సెల్ పై అఖండ 2 సినిమాకు సంబంధించిన పోస్టర్లను వేసి ఆ మూవీ ని ప్రమోట్ చేస్తున్న వస్తున్నట్లు తెలుస్తోంది. దానితో అఖండ 2 మూవీ యూనిట్ వారు కూడా ఈ సినిమా ప్రమోషన్లను  అద్భుతమైన స్థాయిలో నిర్వహిస్తున్నారు అని అనేక మంది అఖండ 2 మూవీ యూనిట్ పై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: