పెళ్లి తర్వాత ఇద్దరూ కుటుంబసభ్యులతో దిగిన ఒక ఫ్యామిలీ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రాజ్ సోదరి శీతల్ నిడిమోరు స్వయంగా షేర్ చేసిన ఈ పిక్, సమంత కొత్త కుటుంబాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ఫోటోలో రాజ్ తల్లిదండ్రులు, శీతల్, ఆమె ముగ్గురు కుమారులు ఒకచోట చేరడంతో… సమంతకు అత్తారింట్లో జరిగిన గ్రాండ్ వెల్కమ్ స్పష్టంగా కనిపించింది.
`ఇషాలో శివుడి ఆశీర్వాదాలతో ఈ పవిత్ర బంధం ముడిపడింది` అంటూ తన అన్న పెళ్లి ఆనందాన్ని శీతల్ ఒక పోస్ట్ రూపంలో పంచుకోవడంతో.. అందుకు సమంత “లవ్ యూ” అంటూ ఇచ్చిన రిప్లై, ఈ ఫ్యామిలీ మధ్య ఉన్న బంధాన్ని మరింత హైలైట్ చేసింది. కొత్త ఫ్యామిలీ, కొత్త బంధాలు, కొత్త ప్రయాణం… సమంత జీవితంలో ఈ చాప్టర్ చూసిన అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ``యూ డిజర్వ్ దిస్ లవ్`` అని మెసేజ్‌లు పెడుతున్నారు.కాగా, రాజ్ నిడిమోరుతో 2020 చివరి నుంచి సమంత సన్నిహితంగా ఉన్నారని ఇండస్ట్రీ టాక్. కానీ ఇద్దరూ తమ వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ బయటి ప్రపంచానికి చెప్పకుండా… పూర్తి ప్రైవేట్‌గా ఉంచుకున్నారు. సమంత విడాకుల తరువాత మళ్లీ సాధారణ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తున్న సమయంలో రాజ్ ఆమెకు పెద్ద సపోర్ట్‌గా నిలిచినట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య బాండింగ్ స్ట్రాంగ్ అయ్యిందని.. ఇప్పుడు ఆ బాండింగ్ పెళ్లికి దారితీసిందని అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి