‘అఖండ 3’ టైటిల్ లీక్ అయ్యిందనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద సంచలనంగా మారింది. ముఖ్యంగా ‘పుష్ప 3’ టైటిల్ కూడా ఇటువంటి విధంగా మేకర్స్ చేత బయటపడటంతో, ఇప్పుడు ‘అఖండ’ సిరీస్‌కి కూడా అదే తరహా సిట్యుయేషన్ రావడం ఫ్యాన్స్ లో అదిరిపోయే హంగామా రేపింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా, బ్లాక్‌బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను రూపొందించిన పాన్-ఇండియా మాస్ ఫెస్టివల్ సినిమా ‘అఖండ 2 తాండవం’ ఇప్పటికే భారీ అంచనాలను సెట్ చేసుకుంది. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే మాటల్లో చెప్పలేనిది… గతంలో వచ్చిన సినిమాల మాదిరిగానే, ఈ మూడో కాంబినేషన్ కూడా దుమ్ము రేపుతుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సినిమా విడుదలకు ముందు నుంచే క్యారెక్టర్ గెటప్‌లు, యాక్షన్ బ్లాక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి పలు అంశాలు సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
ఇలాంటి టైమ్‌లోనే, ‘అఖండ 3’కి సంబంధించిన టైటిల్ లీక్ అయ్యిందనే సమాచారం బయటకు రావడం మరింత సెన్సేషన్‌గా మారింది. ఇప్పటికే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 షూటింగ్ ఫైనల్ స్టేజెస్‌లో ఉండగా, స్టూడియోలో కనిపించిన “Pushpa The Rampage” అనే పేపర్ ఫోటో వైరల్ అయిపోయింది. ఆ పేపర్‌లో ఉన్న టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా కూడా యాక్నాలెడ్జ్ చేయడంతో అది నిజమేనని తేలిపోయింది. తర్వాత థియేటర్లలో కూడా పుష్ప 3 ని అదే టైటిల్‌తో అనౌన్స్ చేశారు ..
అచ్చుగుద్దినట్టు అదే సీన్ ఇప్పుడు ‘అఖండ 3’కూ రిపీట్ అయింది. థమన్ తన స్టూడియో నుంచి షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలో బ్యాక్‌గ్రౌండ్‌లో కనిపించిన "Jai Akhanda" అనే పదాలు ఇప్పుడు మొత్తం ఇంటర్నెట్‌ను హీట్ చేశారు. ఆ పిక్‌లో కనిపించిన ఆ డిజైన్, ఆ ఫాంట్, ఆ లుక్ చూసి నెటిజన్లు కూడా ఇదే అసలు టైటిల్ కావచ్చని బలంగా నమ్ముతున్నారు. బోయపాటి స్టైల్, బాలయ్య మాస్ ఇమేజ్, అఖండ ఫ్రాంచైజ్ ఆరా— “జై అఖండ” టైటిల్ పక్కా అనిపించేలా ఉందనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
అభిమానులైతే“జై అఖండ టైటిల్ అయితే… పాన్ ఇండియా లెవెల్ కేకే!”..“అఖండ 1 వల్ల వచ్చిన గూస్‌బంప్స్ తిరిగి రాబోతున్నాయ్!”.ఈ లీక్‌తో అఖండ యూనిట్ నుంచి అధికారిక అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయ్యి ఎదురుచూస్తున్నారు.

క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి