టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవికి ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉంది. ఆమె క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ అంతకంతకూ పెరుగుతున్నాయి. డాక్టర్ కావాలనుకుని యాక్టర్ అయిన సాయిపల్లవి ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అభినయ ప్రధాన పాత్రలకే ఓటేస్తున్న ఈ నటి సినిమా సినిమాకు తన క్రేజ్‌ను ఊహించని స్థాయిలో పెంచుకుంటున్నారు.

ఇతర స్టార్ హీరోయిన్లతో పోల్చి చూస్తే సాయిపల్లవి సక్సెస్ రేట్ కూడా ఎక్కువేననే సంగతి సినీ వర్గాలకు తెలిసిందే. తాజాగా, రజనీకాంత్ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఈ సినిమా కోసం సాయిపల్లవి ఏకంగా 15 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి నిజానిజాలు తెలియాల్సి ఉంది. తనదైన సహజ నటనతో, అద్భుతమైన డ్యాన్స్‌తో సాయిపల్లవిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆమెకు దక్కిన ఈ గౌరవం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సాయిపల్లవి కెరీర్ పరంగా మరింత బిజీ అవుతుండగా, ఆమె నుంచి కొత్త సినిమాలను, విభిన్నమైన పాత్రలను అభిమానులు ఆశిస్తున్నారు. సహజ నటిగా పేరు తెచ్చుకున్న ఈ తార, భవిష్యత్తులో మరిన్ని భారీ ప్రాజెక్టులలో భాగమయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. వైరల్ అవుతున్న వార్తల గురించి సాయిపల్లవి వైపు నుంచి స్పష్టత రావాల్సి ఉంది.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: