సమంత రాజ్ నిడిమోరు పెళ్లి ఒకింత గ్రాండ్ గా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లి వేడుక గురించి ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
సమంత రాజ్ ల వివాహం భూతశుద్ధి వివాహ వేడుకలో జరగడం విశేషం. ఈ వేడుకలో ఒక ఘట్టాన్ని చూసి తన రోమాలు నిక్కబొడుచుకున్నాయని ఆమె అన్నారు. ఆ ఘట్టం మరేదో కాదు, పెళ్లి సింపుల్ ప్రాసెస్ లో జరిగినా, అగ్ని ముందు వధువు వేలికి, వరుడి వేలికి సూత్రాన్ని ధరించే విధానం. ఆ సమయంలో వారి మధ్య ఏదో శక్తి ఉద్భవించినట్టు అనిపించిందని, అతిథులందరికీ ఈ వేడుక గొప్ప అనుభూతిని ఇచ్చిందని శిల్పారెడ్డి వ్యాఖ్యానించారు. సమంత రాజ్ లాంటి పెళ్లి వేడుకను తాను ఇంతకు ముందెప్పుడూ చూడలేదని ఆమె చెప్పుకొచ్చారు.
సమంత, రాజ్ భిన్న ధృవాల్లాంటి వారని, సమంత చలాకీగా ఉంటుందని, రాజ్ సైలెంట్ గా ఉంటారని ఆమె అన్నారు. ప్రసిద్ధ గాయని శోభరాజ్ రాజ్ కు బంధువు అని తెలిసిందని కూడా శిల్పారెడ్డి వెల్లడించారు.
ఈ వివాహానికి ఒక్కో ఫ్యామిలీ నుంచి దాదాపుగా పది మంది హాజరయ్యారని, సమంత, రాజ్ గురించి బాగా తెలిసిన వారే వచ్చారని, సినిమా ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్ నందినీ రెడ్డి మాత్రమే వచ్చారని శిల్పారెడ్డి తెలిపారు.
సమంత గురించి మాట్లాడుతూ, సమంత, నేను ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకుంటామని, ఒకరినొకరు ఏడిపించుకుంటామని, ఏ విషయంలోనైనా తన తప్పు ఉంటే సమంత ర్యాగింగ్ చేస్తుందని శిల్పారెడ్డి తెలిపారు. సమంత ఎంత కష్టపడిందో దగ్గరగా చూసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుందని కూడా ఆమె చెప్పుకొచ్చారు. శిల్పారెడ్డి చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి