మరికొన్ని గంటల్లో అఖండ2 మూవీ థియేటర్లలో విడుదల కానుంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి, విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అఖండ2 సినిమా నందమూరి అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటి సినిమా అని తెలుస్తోంది. బాలయ్య అభిమానులు ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను మించి సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా చూసి నందమూరి ఫ్యాన్స్ కాలర్ ఎగరేయడం పక్కా అని కామెంట్స్ వ్యక్తమవుతున్నాయి.

దర్శకుడు బోయపాటి శ్రీను నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారని ఫస్ట్  హాఫ్ లో ఇంట్రడక్షన్ సన్నివేశాలు,  విలన్ డామినేషన్ సీన్స్,  ఆధ్యాత్మిక భావనకు సంబంధించిన సీన్స్ హైలెట్ అయ్యాయని. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకోవడంతో పాటు సెకండాఫ్ పై అంచనాలు పెంచేలా  ఉందని సమాచారం అందుతోంది.

సెకండాఫ్ విషయానికి వస్తే అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలతో అఘోరా పాత్రలో బాలయ్య అద్భుతమైన అభినయంతో అంచనాలను మించిన సన్నివేశాలతో  సినిమా ఫ్యాన్స్ విజిల్స్ వేసేలా ఉంటుందని భోగట్టా.  నందమూరి థమన్  ఈ సినిమాకు మరోసారి ప్రాణం పెట్టి  పని చేశారని సినిమాలో చాలా సన్నివేశాల్లో బీజీఎం  సినిమా స్థాయిని పెంచిందని తెలుస్తోంది.  మైథలాజికల్ సినిమాలను ఇష్టపడే వాళ్లకు  ఈ సినిమా మరింత నచ్చుతుంది.

ఈ సినిమాకు క్లైమాక్స్ ఆయువుపట్టు అని చెప్పవచ్చు.  విజువల్ గా అదిరిపోయేలా  ఎమోషనల్ గా మెప్పించేలా  గూస్ బంప్స్ మూమెంట్స్ తో దర్శకుడు బోయపాటి శ్రీను క్లైమాక్స్ ను తెరకెక్కించారని సమాచారం అందుతోంది.  ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లతో ఒకటిగా నిలవడానికి  అవసరమైన అన్ని లక్షణాలు ఉన్న అఖండ2 తాండవం  కలెక్షన్ల విషయంలో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.  సంయుక్త మీనన్ కెరీర్ కు సైతం ఈ సినిమా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.  బాలయ్య కెరీర్ బెస్ట్ సినిమాల్లో అఖండ2 ఒకటి అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: