అఖండ2 మూవీ ప్రీమియర్స్ క్యాన్సిల్  కావడం  సోషల్ మీడియా వేదికగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  అఖండ2 విడుదలపై వచ్చిన స్టే  వల్ల డిస్ట్రిబ్యూటర్లు భయాందోళనకు గురి కావడంతో పాటు నిర్మాతలను ఇతర ఆర్థిక సమస్యలు  చుట్టుముట్టడంతో ప్రీమియర్స్ క్యాన్సిల్అయినట్టు తెలుస్తోంది. ప్రీమియర్స్ సమయానికి పరిస్థితి మారుతుందని అందరూ భావించినా అందుకు భిన్నంగా జరిగింది.

ప్రీమియర్స్ క్యాన్సిల్ అనే వార్త అభిమానులను తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.  భారీ రేట్లకు మార్కెట్ కావడంతో పాటు రికార్డ్ స్థాయిలో నాన్ థియేట్రికల్ హక్కులు పలికిన సినిమాకు ఈ పరిస్థితి ఏంటని అభిమానులు ఫీలయ్యారు.  బాలయ్య బోయపాటి కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.  14 రీల్స్ సంస్థకు గతంలో ఉన్న వివాదాలు సైతం అఖండ2 సినిమాను ఇబ్బందుల్లోకి నెట్టాయని చెప్పవచ్చు.

నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్లు సరిగ్గా డబ్బులు కట్టకపోవడంతో డెఫిసిట్ వచ్చిందని  మ్యాంగో రామ్ దగ్గర చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. సినిమా రిలీజ్ కోసం ప్రయత్నాలు  ముమ్మరంగా జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఫలిస్తే మాత్రం  రేపు విడుదల జరుగుతుంది.   ఎన్నో ఇబ్బందులను అధిగమించి అఖండ2 విడుదలై బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని ఆశిద్దాం.

అఖండ2 సమస్యలు సర్దుమణుగుతున్నాయని విడుదలకు ఎలాంటి ఇబ్బందులు  లేకపోవచ్చని  తెలుస్తోంది.  అఖండ2 సినిమా  బాలయ్య బోయపాటి శ్రీను   కెరీర్ లో  రియాకార్డులు క్రియేట్ చేసే సినిమా అవుతుందేమో చూడాల్సి ఉంది.  అఖండ2 టాలీవుడ్ రేంజ్ ను పెంచే సినిమా  అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: