కొంతమంది నెటిజన్లు సమంత, రాజ్ నిడమోరుతో 2019లోనే ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ షూటింగ్ సందర్భంగా దగ్గరయ్యారని, అప్పటి నుంచే వీరి మధ్య రిలేషన్ ఉందని, ఈ కారణంగానే నాగచైతన్య విడాకులు తీసుకున్నాడని చెబుతూ అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.ఇదే విషయాన్ని ఆధారంగా తీసుకొని మరికొందరు —“చైతన్య తప్పు చేయలేదు”,“శోభిత, చైతు ఇన్నోసెంట్”,“సమంత వల్లే విడాకులు వచ్చాయి” అంటూ సమంతను లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.
‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ షూటింగ్ 2019లో ప్రారంభం కాగా, సమంత–నాగచైతన్య విడాకులు 2021లో అధికారికంగా ప్రకటించబడ్డాయి. ఈ చిన్న టైమ్‌లైన్‌ను ఆధారంగా చేసుకుని కొందరు "సమంత చీట్ చేసింది" అని నిర్ణయాలు తీసుకుంటున్నారు. కానీ వాస్తవంగా చూస్తే— రాజ్ నిడిమోరుకు ఆ సమయంలో భార్య శ్యామలీ ఉంది. సమంత, శ్యామలీ ఇద్దరూ కూడా మంచి స్నేహితులే. సమంతకు శ్యామలీ కామెంట్లు, సపోర్టివ్ మెసేజులు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకంగా, 2022 నవంబర్‌లో మయోసైటిస్ గురించి సమంత పోస్ట్ పెట్టినప్పుడు, ఆమె “నా గుడ్ ఫ్రెండ్ రాజ్ నన్ను ఇలా ప్రోత్సహించాడు” అని రాసింది. దానికి రాజ్ తొలి భార్య శ్యామలీ, "రాజ్ దగ్గర ఇలాంటివి చాలా ఉంటాయి సామ్" అంటూ హాయిగా, ఫ్రెండ్లీగా కామెంట్ చేసింది . దీంతో ఆ సమయంలో రాజ్–సమంత మధ్య ఎలాంటి అనుమానాస్పద విషయాలు లేవని స్పష్టమవుతుంది. ఎందుకంటే నిజంగా ఏదైనా తప్పు రిలేషన్ ఉంటే… రాజ్ భార్య సపోర్టివ్‌గా సమంత పోస్టులపై ఇలా కామెంట్ చేయడం అసాధ్యం.
ఇప్పటికీ ఈ విడాకుల అసలు కారణం ఏంటి అనేది ఇద్దరు వ్యక్తులకు మాత్రమే పూర్తిగా తెలుసు. బయట ఎవరు చెప్పేది ఊహాగానాలు మాత్రమే. ఇది వారి వ్యక్తిగత జీవితం. వారు ముందుకు వెళ్లిపోయారు. కానీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో పాత విషయాలను తవ్వడం, పాత ఆరోపణలను మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకురావడం కొనసాగిస్తున్నారు. ఇలా కాకుండా అందరూ "మూవ్ ఆన్" అయితే — నెగిటివిటీ తగ్గుతుంది. వ్యక్తిగత దూషణలు ఆగుతాయి.సోషల్ మీడియా మరింత ఆరోగ్యకరంగా మారుతుంది అనే అభిప్రాయం సాధారణ ప్రజలది. ఇక మొత్తం విషయాన్ని చూస్తే… సమంత పెళ్లి అనూహ్యంగా జరిగినా, ఇప్పుడు బయటకు వస్తున్న ఈ ఆరోపణలకు స్పష్టమైన ఆధారాలు లేవు. అయినప్పటికీ ఆమెపై సోషల్ మీడియా దాడి మాత్రం ఆగేలా కనిపించడం లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి