సంచలన దర్శకుడు వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా మొదలు పెట్టినప్పటి నుండి టిడిపి నుండి వ్యతిరేకత వస్తూనే ఉంది. కావాలని వై.సి.పి నేతలతో కలిసి వర్మ ఎన్.టి.ఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా ఈ సినిమా తీస్తున్నారని అన్నారు. ఇక రంగంలోకి అలనాటి హీరోయిన్ వాణి విశ్వనాధ్ కూడా దిగి వర్మ ఆ సినిమా ప్రయత్నం మానుకోవాలని లేదంటే అతని ఇంటి ముందు ధర్నా చేస్తానని అన్నారు. 


ఇదవరకే టిడిపి నేత సోమిరెడ్డికి సూపర్ కౌంటర్ ఇచ్చిన వర్మ వాణి విశ్వనాధ్ కు అదే తీరులో రెస్పాన్స్ ఇచ్చాడు. వాణి విశ్వనాధ్ గారు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా తీస్తే మీరు నా ఇంటి ముందు ధర్నా చేస్తా అన్నారు. నాకసలు ఇళ్లే లేదు మరి అలాంటప్పుడు మీరు ఎక్కడ ధర్నా చేస్తారు. ఇక నేను రోజుకి రోడ్ల మీద తిరుగుతాను ఇక నాతో పాటే తిరిగితే సుకుమారమైన మీ పాదపద్మాలు కమిలిపోవూ..? అంటూ రిటార్డ్ ఇచ్చాడు వర్మ. 


ఎన్.టి.ఆర్ పొలిటికల్ విషయాల పట్ల ఈ సినిమాలో ప్రస్థావించడం జరగదని చెప్పినా సరే టిడిపి నేతలు అభిమానులు ఇలా తనని టార్గెట్ చేయడం వర్మకు మరి కోపాన్ని తెప్పిస్తుంది. సినిమా ఎన్.టి.ఆర్ ఇమేజ్ కు డ్యామేజ్ చేసేలా ఉంటే మాత్రం వర్మని ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్.. టిడిపి కార్యకర్తలు ఎటాక్ చేయక తప్పదు. 


ఇదిలాఉంటే వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రంగం సిద్ధం చేస్తుండగా మరోపక్క బాలయ్య కూడా ఎన్.టి.ఆర్ బయోపిక్ పై సినిమాను రెడీ చేస్తున్నాడు. తేజ డైరక్షన్ లో రాబోతున్న ఈ బయోపిక్ పై ఇంకా డీటేల్స్ తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: