ఎన్నికలు వచ్చాయి అంటే చాలు ప్రధాన పార్టీలు అన్నీ కూడా గెలుపే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉంటాయి. అయితే ఇలా ప్రధాన పార్టీలు మాత్రమే కాదు ఎంతోమంది ఇండిపెండెంట్లుగా కూడా పోటీ చేస్తూ ఉంటారు. ఇక కొన్ని కొన్ని స్థానాలలో భారీగా ఇండిపెండెంట్ లు పోటీ చేయడం ప్రధాన పార్టీలకు ఇబ్బందిగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. తమకు రావాల్సిన కొన్ని ఓట్లు చివరికి ఇండిపెండెంట్ లకు వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరోసారి ఇండిపెండెంట్ లతో ప్రధాన పార్టీలకు తలనొప్పులు తప్పడం లేదు.


 మొత్తంగా 17 లోక్సభ స్థానాలకు తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక 17 స్థానాలలో పోటీకి 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే 100 మంది నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో తుది పోరులో నిలిచే అభ్యర్థులు ఎవరు అన్న విషయం ఖరారు అయిపోయింది. కాగా ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ జరగగా నిన్నటితో నామినేషన్లు ఉపసంహరణ గడువు కూడా ముగిసింది. అయితే ఎక్కువగా మల్కాజ్గిరిలో 15 మంది అభ్యర్థులు  నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అతి తక్కువగా ఆదిలాబాద్ లో ఒకే ఒక అభ్యర్థి మాత్రమే పోటీ నుంచి వైదొలిగారు.


 అయితే గత పార్లమెంట్ ఎన్నికలతో పోల్చి చూస్తే ప్రస్తుతం ఇక ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్య కాస్త ఎక్కువగానే పెరిగింది. వచ్చే నెల 13న జరిగే ఎన్నికల్లో 525 మధ్య అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2019లో 645 మంది నామినేషన్లు వేస్తే ఈ దఫా ఎనిమిది వందల తొంబై మూడు మంది నామినేషన్ దాఖలు చేసారు.  గడిచిన ఎన్నికలలో 142 మంది నామినేషన్లు రిజెక్ట్ అయితే ఈ దఫా 268 మందికి పైగా నామినేషన్లు తీరస్కారానికి గురయ్యాయి. గతంలో 60 మంది ఉపసంహరించుకుంటే ఈసారి 100 మంది ఉపసంహరించుకున్నారు. గతంలో 443 మంది తుది పోరులో ఉంటే ఈ దఫా 525 మందికి పెరిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: