ప్రముఖ అస్సామీస్‌ చిత్రం ‘విలేజ్‌ రాక్‌స్టార్స్‌ ఆస్కార్స్‌’ 2018 జాబితాలో స్థానం సంపాదించలేకపొయింది. ఉత్తమ విదేశీ చిత్ర కేటగిరిలో ఎంపికైన ఈ చిత్రం తర్వాత జరిగే రౌండ్స్‌లో స్థానం కోల్పోవాల్సివచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆస్కార్స్‌ తన అధికారిక వెబ్స్‌సైట్‌ ద్వారా ప్రకటించింది.   2017లో విడుదలైన ఈ చిత్రాన్ని రీమా దాస్‌ తెరకెక్కించారు. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది.

Related image

తన స్వస్థలమైన అస్సోంలోని చైగావ్‌ గ్రామంలోనే రీమా దాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ చిత్రాన్ని ఆస్కార్స్‌కు ఎంపిక చేసింది. పేద చిన్నారులు బాధలను ఓర్చుకుంటూ తమ జీవితాలను ఎలా సంతోషంగా మలుచుకున్నారో అన్నది ఈ చిత్రం నేపథ్యం. విలేజ్ రాక్‌స్టార్స్‌కు అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది.

Image result for Village Rockstars

టొరంటోలో జరిగిన వరల్డ్ ప్రీమియర్‌లో ప్రశంసలు అందుకున్నది. ముంబై ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ దీన్ని ప్రదర్శించారు. 65వ జాతీయ పురస్కారాల్లోనూ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును గెలుచుకున్నది. 2019 జనవరి 22న ఏ చిత్రాలు నామినేట్‌ అయ్యాయనేది ఆస్కార్స్‌ ప్రకటిస్తుంది. ఫిబ్రవరి 24న 91వ ఆస్కార్స్‌ వేడుక అట్టహాసంగా జరగబోతుంది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: