నిజాం రాజుల చరిత్ర గురించి తెలియని వాళ్ళు ఉండరు..ఎంతో డబ్బు..నగలు..ఆభరణాలు..వజ్రాలు..ఇలా వారి పాలన జీవితం చాలా విలాసవంతంగా సాగిపోయింది..కానీ ఇప్పుడు మీరు తెలుసుకోబోయే నిజాం వారసుడి కథ‌ మాత్రం..కేవలం రెండు గదులు ఉన్న ఇంట్లో సాగిపోతోంది..నిజాం వారసుడిగా తనకున్న కీర్తి..డబ్బు ఏమయ్యాయి..దర్జాగా బ‌తకాల్సిన మనిషి ఎందుకు ఎక్కో ఉండిపోయాడు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చ‌ద‌వాల్సిందే.


ఏడు తరాలపాటు హైదరాబాద్‌ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన నిజాం నవాబుల వారసుడు  మిర్‌ బర్కత్‌ అలీ ఖాన్‌  ఫ్రాన్స్‌లో పుట్టాడు. అత‌డి విద్యాభ్యాసం లండ‌ర్‌లో జ‌రిగింది. ఆ త‌ర్వాత స్వదేశానికి వచ్చి హైదరాబాద్ నడిబొడ్డున 400 ఎకరాల పచ్చటి ప్రకృతి నడుమ నిర్మించిన చిరాన్‌ ప్యాలెస్‌లో విలాసవంతమైన జీవితం గడిపారు.  అయితే . డబ్బు, ఆస్తి వివాదాలతో విసుగెత్తి  మళ్లీ విదేశాలకు వెళ్లిపోయారు. హైదరాబాద్ లో విలాసవంతమైన జీవితం వదులుకుని ..ఆస్ట్రేలియాలో 2 లక్షల హెక్టార్ల ఫాంహౌజ్‌ని కాదనుకుని ..ఇప్పుడు ట‌ర్కీలో రెండు గదుల ఇంట్లో ఉంటున్నాడు.


నిజాం వారసుడి ప్రస్తుత జీవితం ఇది.. అప్పుడప్పుడూ చుట్టంచూపుగా హైదరాబాదు వచ్చిపోవడం తప్ప..మిగిలిన కాలం మొత్తం ఆయ‌న విదేశాలలోనే గడిపారు. ఏడవ నిజాం మిర్‌ ఉస్మాన్‌ అలీ ఖాన్‌ తన పెద్ద కొడుకు ఆజం జాను కాదని అతని కొడుకైన, తన మనవడు ముక్రం జాను వారసుడిగా ప్రకటించారు. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడ ధ్రువీకరించింది. ప్రధాని ఇందిరా గాంధీ అప్పట్లో  రాజభరణాల రద్దు చేసే వరకూ 8వ నిజాంగా గౌరవించింది.


హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో 400 ఎకరాల వైశాల్యంలోని అడవిలో చిరాన్‌ ప్యాలెస్‌లో ఆయన నివాసం ఉండేవారు. పీవీ నరసింహారావు ముఖ్యమంత్రిగా తీసుకువచ్చిన భూ పరిమితి చట్టంతో ఆయనకు మిగిలింది ఆరు ఎకరాలు మాత్రమే.ఇప్పుడు ఆ భూమి కాసు కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ పార్కుగా ఉంది. ఉస్మాన్‌ అలీ ఖాన్‌ మరణించిన తర్వాత నిజాం వారసులుగా అనేక మంది ఆస్తిలో హక్కు కోసం కోర్టులను ఆశ్రయించడం, పన్నుల భారం, రాజభరణాల రద్దుతో ఆయన ఆస్ట్రేలియాకు వెళ్లిపోయారు.అక్కడి ఒక మారుమూల ప్రాంతంలోసముద్ర తీరంలో ఉండేవారు.


1975లో ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించడం, అప్పటికే ఇందిరాగాంధీ తనయుడు సంజయ్‌ గాంధీతో సంబంధాలు క్షీణించడం, రాజమాత గాయత్రీ దేవి అరెస్ట్‌ వంటి పరిణామాల నేపథ్యంలో ఆయన చాలాకాలం భారత్‌కు రాలేదు. అంతకుముందు కూడా ఆయన ఎక్కువ కాలం బ్రిటన్‌, టర్కీలలో గడిపారు. తన రెండో భార్యకి విడాకులు ఇచ్చినప్పుడు.. ఆమెకు భరణం కింద మొత్తం భూమిని అమ్మి ఆ సొమ్ము ఇచ్చి టర్కీకి మకాం మార్చారు.


అక్కడ మధ్యధరాసముద్ర తీరంలోని ఒక చిన్న రెండు గదుల ఇంటిలోనే నివాసం ఉంటున్నారు.. మొత్తం ఐదుగురు భార్యలు ఉన్న ఆయన మొదటి భార్య టర్కీ  తన వెంట ఆస్ట్రేలియాకు రావడానికి నిరాకరించడంతో ఆమెకు విడాకులిచ్చారు. మళ్ళీ ఆమెతో పాటు జీవితం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు నిజాం ఆస్తుల ఆలనాపాలనా ఆమె చూస్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్‌కు వస్తే మాత్రం చిరాన్‌ ప్యాలెసే ఆయన నివాసం.

మరింత సమాచారం తెలుసుకోండి: