అమెరికాలోని భారతీయులు భారతీయ సనాతన సాంప్రదాయలని ఇప్పటికీ కొనసాగిస్తూ తమ భవిష్యత్తు తరాలు మునుముందు ఈ భారతీయ పండుగలు మరిచిపోకుండా, వాటిని కొనసాగించేలా చేస్తున్నారు. ఈ మేరకు మన సాంప్రదాయలలో భాగం అయిన పూజలు, వ్రతాలు, నోములు, ఇలా ప్రతీ ఒక్క కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్దలతో ఆచరిస్తున్నారు. ఇదిలాఉంటే. అయ్యప్ప స్వామి దీక్ష కూడా ధరించి అక్కడే దీక్ష విరమణ కూడా చేపడుతూ కొత్త వొరవడిని సృష్టించారు.

 

అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కి సమీపంలోని మేరీ ల్యాండ్ లో శ్రీ శివా విష్ణు గుడి ఉంది. అందులో శ్రీ అయ్యప్ప స్వామీ గుడి కూడా ఏర్పాటు చేయడంతో పాటు 18మెట్లుతో భారీ గుడిని ఏర్పాటు చేశారు. అమెరికాలో ఉంటున్న భారతీయులు ఈ గుడికి తరుచూ వస్తూనే ఉంటారు. అంతేకాదు అయ్యప్ప స్వామి మాల ధారణ చేపట్టి ప్రతీ శనివారం రోజున స్వామిని దర్శించుకోవడానికి ఈ గుడికి వస్తారని గుడి నిర్వాహకులు సురేష్ బయు నివాస్ తెలిపారు.

 

ఈ క్రమంలోనే సుమారు 200 మంది భారతీయులు అయ్యప్ప స్వామీ మాల ధారణ చేపట్టారని. అయ్యప్ప స్వామిని వంశపారంపర్యంగా కొలిచే  తంత్రీ నంబూద్రి ఆధ్వర్యంలో ఆ 200 మంది అయ్యప్ప మాల ధారణ చేసిన వారు 18 మెట్లు ఎక్కి దీక్ష విరమించారని నిర్వాహకులు తెలిపారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: