ఈజిప్టు సూయెజ్ గవర్నరేట్‌ లో పర్యాటకులను తీసుకెళ్తున్న రెండు బస్సులు ట్రక్కును డీకొనడంతో ముగ్గురు భారతీయులు మృతి చెందగా, 13 మంది గాయపడ్డారని ఇక్కడి భారత రాయబార కార్యాలయం ఆదివారం తెలిపింది. కైరోకు తూర్పున 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐన్ సోఖ్నా పట్టణానికి సమీపంలో బస్సులు శనివారం బీచ్-రిసార్ట్ పట్టణం హుర్ఘడకు వెళుతుండగా ట్రక్కును ఢీకొట్టాయి.

 

 

 

 

 

 

 

 

 

 

 

ఐన్ సోఖ్నా సమీపంలో డిసెంబర్ 28 న జరిగిన బస్సు ప్రమాదంలో 3 మంది భారతీయ పౌరులు ప్రాణాలు కోల్పోయారని మేము చింతిస్తున్నాము. గాయపడిన ఇతరులు ఈజిప్టులోని వివిధ ఆసుపత్రులలో వైద్య చికిత్స పొందుతున్నారు  అని ఈజిప్టులోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది.   ప్రమాదం లో మరణించిన , గాయపడిన వారి బంధువులను సంప్రదించి, వారికి అన్ని విధాలా  సహాయం అందిస్తున్నట్లు ఈజిప్టులోని భారత రాయబార కార్యాలయం  తెలిపింది.  ఎంబసీ అధికారులు ఆసుపత్రులలో ఉన్నారు మరియు ఆసుపత్రి అధికారులతో సంప్రదిస్తున్నారు,  అని  ఈజిప్టులోని భారత రాయబార కార్యాలయం  తెలిపింది.

 

 

 

 

 

 

 

 

 

బస్సుల్లో 16 మంది భారతీయ పర్యాటకులు ఉన్నారని ఈజిప్టులోని భారత రాయబార కార్యాలయం  తెలిపింది.  స్థానిక మీడియా ప్రకారం, మృతుల్లో ఇద్దరు మలేషియన్లు మరియు ముగ్గురు ఈజిప్షియన్లు ఉన్నారు. 20 మందికి పైగా గాయపడి  ఈజిప్ట్ లోని వివిధ  ఆసుపత్రి లో చికిత్స పొందుతున్నారు.  ఐన్ సోఖ్నా అనేది సూయజ్ గవర్నరేట్ లోని ఒక పట్టణం, ఇది ఎర్ర సముద్రం యొక్క గల్ఫ్ ఆఫ్ సూయెజ్ యొక్క పశ్చిమ ఒడ్డున ఉంది. ఇది సూయెజ్‌కు దక్షిణాన 55 కిలోమీటర్లు మరియు కైరోకు తూర్పున 120 కిలోమీటర్లు ఉంది. ప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంతవరకు తెలియ లేదు. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు జరుగుతున్నది.  ఈ ప్రమాదం లో చని పోయిన, గాయ పడిన వారి కుటుంబ సభ్యులు  దుఃఖ సంద్రం లో మునిగి పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: