గతంలో భారత్ లో ఉండే ఆడపిల్లల తల్లి తండ్రులు ఎన్నారై సంభంధాలు చేయడానికి ఆరాటపడేవాళ్ళు. ఎంత డబ్బయినా వెచ్చించి మరీ పెళ్ళిళ్ళు చేసేవారు.పెళ్లి  చేసుకున్న తరువాత కొందరు ఎన్నారై లు  దేశం కాని దేశంలో తమ భార్య లకి నరకం చూపించే వాళ్ళు. అదనపు కట్నం కావాలంటూ వేధించే వాళ్ళు. ఇలా ఎంతో మంది మహిళలు ఆత్మహత్యలు చేసుకోగా మరికొందరు కుక్కిన పేనుల్లానే ఏమి చేయాలో తెలియక అక్కడే ఉండిపోయేవాళ్ళు. అయితే అలాంటి వారి అరచాకాలకి అడ్డుకట్ట వేయాలని భావించిన కేంద్రం 

 

తమ ఆధ్వర్యంలో ఓ మహిళా భద్రతా విభాగాని ఏర్పాటు చేసింది. దీనికి ఎన్నారై మహిళా భద్రతా కేంద్రంగా పేరు పెట్టింది. విదేశాలలో వేధింపులకి పాల్పడే అల్లుళ్ళకి ఇది కళ్ళెం వేయనుందని తెలిపింది. ఈ కేంద్రం పెట్టింది మొదలు ఇప్పటి వరకూ వచ్చిన ఫిర్యాదులలో 5 మంది అల్లుళ్ళపై చర్యలు తీసుకున్నారు. వారి వీసాలని రద్దు చేయించి కేసులు నమోదు చేశారు.

 

గతంలో ఇలాంటి కేసులు ఉన్న సమయంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసేది భారత ప్రభుత్వం అయితే అక్కడి చట్టాలని అడ్డుపెట్టుకుని ఆ కేసులు వీగిపోయేలా చేసేవారు. అయితే తన రూటు మార్చిన కేంద్రం అలాంటి ఎన్నారై అల్లుళ్ళ ఆటలు కట్టించడానికి ఎన్నారై మహిళా భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఎన్నో స్వచ్చంద సంస్థలు, వివిధ దేశాల రాయబార కార్యాలయాలు,న్యాయవాదుల తో ఏర్పాటు చేసిన ఈ విభాగం ఎంతో సత్ఫలితాలు ఇస్తోంది..ఇప్పటి వరకూ 5 మంది పాస్ పోర్ట్ లు రద్దు చేయించిన ఈ విభాగం, ఇంకా పెండింగ్ లో ఉన్న సుమారు 59 కేసులపై దృష్టి పెట్టింది. కేసుల్లో నిజానిజాలు బట్టి వారి వారి పాస్ పోర్ట్ లు రద్దు చేయించి వారిని ఇండియా రప్పించడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తోందని సత్వర న్యాయం బాధిత మహిళలకి జరుగుతోందని అంటున్నారు భాదిత తల్లి తండ్రులు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: