ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలోని అన్ని వ్యవస్థలు కుంటుపడిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవస్థలలో అమెరికా ఇమ్మిగ్రేషన్ కార్యాలయాలు సైతం దాదాపు ఒక సంవత్సరం నుండి మూసివేయబడ్డాయి. అయితే ఇప్పుడు కరోనా కాస్త శాంతించడంతో అంతర్జాతీయ ప్రయాణాలు జరుగుతున్నాయి. ఇక్కడ వీసా సమస్యలు ప్రయాణికులకు ఎదురవుతుండడం స్పష్టంగా తెలుస్తోంది. అంతే కాకుండా ఇమ్మిగ్రేషన్ కు సంబంధించిన నియమాలు కూడా ఎప్పటి కప్పుడు మారుతుండడంతో ఎన్ఆర్ఐ లు తీవ్రంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే ఇటువంటి సమస్యలను అన్నింటినీ తీక్షణంగా పరిశీలించిన పిదప కొంత మంది నిపుణులు కలిసి ఒక సహాయక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.

ఈ హెల్ప్ డెస్క్ ద్వారా వీసాకు సంబంధించి ఎటువంటి సమస్యకు అయినా తగిన పరిష్కారం చూపబడుతుంది. ఇమ్మిగ్రేషన్ సమస్యలు ఉన్న వారు ఈ మెయిల్ ఐడి కి మీ సమస్యను పంపండి. హెల్ప్ డెస్క్ మెయిల్: nri.economics@gmail.com  ఇందులో భాగంగా ఎన్ఆర్ఐ ప్రజలు కొంతమంది మా హెల్ప్ డెస్క్ ను అడిగిన ఒక ప్రశ్నను మీ ముందు ఉంచుతున్నాము.

ప్రశ్న: ఒక ఎన్ఆర్ఐ ఈ విధంగా అడుగుతున్నాడు, నేను అమెరికాలో ఎల్ -1 వీసా మీద పనిచేస్తున్నాను. అయితే నా భార్య మాత్రం అమెరికాకు బయట ఉంది. ఆమెకు ఉన్న ఎల్ 2 వీసా సమయం అయిపోయింది. కానీ వీసా స్టాంపింగ్ చేయించుకోవడానికి అప్పాయింట్మెంట్ కోసం చాలా ప్రయత్నించాము. వీసా లేకుండా ప్రయాణం చేయడం వీలు కాదు. సంవత్సరం నుండి ఇమ్మిగ్రేషన్ ఆఫీస్ లు సైతం తెరవలేదు. ఇప్పుడు అప్పాయింట్మెంట్ ఎలా పొందగలమో చెప్పండి అని అడిగారు.

సమాధానం: దీనికి హెల్ప్ డెస్క్ ఇచ్చిన సమాధానం ఇలా ఉంది. మీరు తెలిపిన సమస్యకు మా వద్ద సరైన సమాచారం లేదని చెప్పదనాయికి చింతిస్తున్నాము. ఒక మార్గం అయితే ఉంది, మీ భార్యను డ్రాప్ బాక్స్ విధానం ద్వారా అప్పాయింట్మెంట్ పొందగలరు. ఒకసారి ప్రయత్నించి చూడండి అని సెలవిచ్చారు.

ఈ విధంగా ఈ హెల్ప్ డెస్క్  ఎన్ఆర్ఐ ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ ఉంది. మీకు కనుక ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే పైన ఇచ్చిన మెయిల్ ఐడి కి మీ సందేహాలను పంపండి.


మరింత సమాచారం తెలుసుకోండి: