ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది ఎంతో ఒక మధురమైన జ్ఞాపకం. అందుకే ప్రతి ఒక్కరూ పెళ్లిని అంగరంగ వైభవంగా చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. తమ కలల రాజకుమారుడిని చేసుకోవాలని అమ్మాయిలు.. కలల రాకుమారిని చేసుకోవాలని అబ్బాయిలు ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇక బంధు మిత్రులు కుటుంబ సభ్యులందరి మధ్య ఘనంగా పెళ్లి చేసుకుని  ఒకటి అవుతూ ఉంటారు. అయితే ముందు ఒక యువతిని పెళ్లి చేసుకోవడం ఇక ఆ తర్వాత కాలంలో అనుకోని విధంగా రెండో పెళ్లి చేసుకోవడం లాంటి ఘటనలు ఇటీవల కాలంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి.



 ఇక సోషల్ మీడియాలో ఇలాంటి తరహా ఘటనలు ఎప్పుడూ తెరమీదికి వస్తూనే ఉంటాయి అని చెప్పాలి. కానీ ఒకేసారి ఏకంగా ఇద్దరు ని పెళ్లి చేసుకున్నారు అంటే చాలు అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. వీడు ఎవడ్రా బాబు ఏకంగా ఒకేసారి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు. సరే వాడికి అయితే బుద్ధి లేదు కనీసం ఆ అమ్మాయిలు ఎలా పెళ్లికి ఒప్పుకున్నారు అని అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా సరే. కానీ ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిసిన తర్వాత మాత్రం అందరూ షాక్ ఖాయం అని చెప్పాలి.



 ఇప్పటివరకు ఒక వ్యక్తి ఇద్దరు అక్కాచెల్లెళ్లు పెళ్లి చేసుకోవడం చూశాము. కానీ ఇక్కడ ఒక యువకుడు మాత్రం ఇద్దరు కాదు ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒకేసారి వివాహమాడాడు. ఈ ఘటన కాంగోలో వెలుగులోకి వచ్చింది. లువే జో అనే యువకుడు ముగ్గురు అక్క చెల్లెలు నటాషా, నాటాలియా, నాదేగే ల ను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. ఆ ముగ్గురు అక్క చెల్లెలు మమ్మల్ని పెళ్లి చేసుకో అంటూ సదరు యువకుడిని కోరడం గమనార్హం. కాంగోలో ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటం లీగల్ కావడంతో ఇక వీరికి ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాలేదు.  లువే జో తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతో వారు పెళ్లికి హాజరు కాలేదట..

మరింత సమాచారం తెలుసుకోండి: