నేటి రోజుల్లో సోషల్ మీడియా వాడకం ఎలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  సోషల్ మీడియా పుణ్యమా అని అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లోనే ప్రపంచాన్ని మొత్తం చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. ఇక అన్ని విషయాలను తెలుసుకోవడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రపంచంలో ఎక్కడో మారుమూల జరిగిన సంఘటనలు కూడా నిమిషాల వ్యవధిలో స్మార్ట్ఫోన్ లో కళ్ళముందు వాలిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇలా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చే కొన్ని ఘటనలు ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఉడత అనే చిన్న జీవి గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఉడతను చూస్తే ప్రతి ఒక్కరికి ముచ్చటిస్తూ ఉంటుంది. అది మన ముందు గెంతుతూ వెళ్తూ ఉంటే చూసి ఎంతో మంది మురిసిపోతూ వుంటారు అని చెప్పాలి. అయితే ఇటీవలే బ్రిటన్లో ఉడతల విషయంలో అక్కడి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం మనుషులకు మాత్రమే గర్భనిరోధక మాత్రలు ఇవ్వడం లాంటివి చూసాము. అవాంఛిత గర్భం రాకుండా ఇలా గర్భనిరోధక మాత్రలు వాడుతూ ఉంటారు. కానీ బ్రిటన్ లో మాత్రం ఏకంగా ఉడతలకు గర్భనిరోధక మాత్రలు ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం సిద్ధమైంది. ఇది కాస్త ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.


 బ్రిటన్లో బూడిదరంగు ఉడతల పై  ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. స్థానిక వన్యప్రాణుల అయినా ఎర్ర ఉడతలను ఇవి తన బలంతో సంహరిస్తూ ఉండడంతో దేశం మొత్తంలో ఎర్ర ఉడతల సంఖ్య తగ్గిపోతుంది. దీంతో బూడిద బూడిద ఉడతలు లక్షల చెట్లను కలపను కొరికేస్తూ పర్యావరణానికి కూడా హాని కలిగిస్తున్నాయని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే వేగంగా పిల్లలు కనే ఈ జాతికి గర్భనిరోధక మందు ఇవ్వాలని నిర్ణయించింది బ్రిటన్ ప్రభుత్వం. ఈ క్రమంలోనే హాసీల్ నెట్ లాంటి క్రీం తో కలిపి ఉడుతలకు ఆహారం పెట్టబోతున్నారు అక్కడి అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Nri