ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, ఆంధ్రకు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్టించిన దగ్గరి నుండి ఎన్నికల సమయంలో తామిచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు వెళ్లడంతో పాటు తన వంతుగా ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా పలు రకాల సంక్షేమ పధకాలు ప్రవేశ పెడుతూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం ఆంధ్రకు మూడు రాజధానులు ఉండే అవకాశం ఉందని సీఎం మీడియాకు తెలిపారు. అయితే ఇదే అంశాన్ని ఆయుధంగా చేసుకున్న ప్రతిపక్షాలు సీఎం పై, అలానే వైసిపి పార్టీపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. 

 

వాస్తవానికి కొందరు ప్రజలు సీఎం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తుంటే మరికొందరు మద్దతు పలుకుతున్నారు. అయితే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మూడు చోట్ల రాజధానులు ఉంటె, ప్రతి ఒక్క ప్రాంతం వారికీ సమానంగా అభివృద్ధి జరుగుతుందని, అందువల్లనే సీఎం ఈ విధంగా ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక ఆయన నిర్ణయం వెనుక గత ప్రభుత్వ హయాంలో టిడిపి ప్రభుత్వం వారు అందినకాడికి భూములు తక్కువ ధరలకు కొనుగోలు చేసి, రాజధాని అమరావతి ఏర్పాటు చేసిన తరువాత భూముల ధరలకు రెక్కలు రావడంతో రియల్ ఎస్టేట్ దందాను కొనసాగించారని వాదన కూడా వినపడడంతో, అటువంటి తప్పులు జరుగకూడదనే ఉద్దేశ్యంతోనే సీఎం ఈ విధంగా మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నట్లు కూడా పలు రాజకీయ వర్గాల్లో వార్తలు వినపడుతున్నాయి. 

 

ఇక సీఎం నిర్ణయం పై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేస్తూ మద్దతు పలికారు. అయితే నిన్న ఆయన మద్దతు పలుకలేదని అది తప్పుడు వార్త అని మరొక వార్త ప్రచారం అయింది. అయితే చివరకు ఈ మ్యాటర్ చిరంజీవి వద్దకు చేరడంతో, మెగాస్టార్ ఒక ప్రకటన రిలీజ్ చేసారు. నిజానికి మొన్న తాను సీఎం గారి మూడు రాజధానుల ప్రతిపాదనను సమర్ధించినట్లు ప్రకటించింది అక్షరాలా నిజం అని, అలానే అది తప్పుడు వార్త, దానికి మద్దతు పలుకలేదు అంటూ నిన్న ప్రచారం అవుతున్న వార్త పూర్తిగా అవాస్తవం అని మెగాస్టార్ మీడియా కు ఒక ప్రకటన రిలీజ్ చేసారు. కాగా ఆయన ప్రకటన ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: