బీజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఏపి రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు రజాక్ వైసిపి నాయకుడు సవాల్చేసారు. శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి నన్ను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాడ్డుతున్నారనే ఆరోణ నిరుపించగలవా అని ఆయన సవాల్ చేసారు. ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి నా ద్వార అక్రమాలకు పాల్పడ్డారని నిరూపించలేకపోతే రాజాసింగ్ మీరు రాజీనామా చేయగలరా నిరూపిస్తే మా ఎమ్మెల్యే రాజీనామా చేసేందు సిద్దం అని ఆయన సవాల్ విసిరారు. మల్లికార్జునస్వామి వారిని ఏ మతం వారైన కొలవచ్చు కొలవకుడదని మీ మత గ్రంధంలో రాశారా రాజ్యంలో రాశారా అని నిలదీశారు.

శ్రీశైలం దేవస్థానంలో నాపేరుమీద పావల పని కూడ నేను చేయలేదు మా ముస్లిం సోదరులకు కూడ దేవస్థానంలో ఎటువంటి కాంట్రాక్టు ఇప్పించలేదు అని ఆయన స్పష్టం చేసారు. ఇక రాజా సింగ్ కు శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి సవాల్ చేసారు. రాజసింగ్ నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు శ్రీశైలంలో లో పెద్దల సమక్షంలో చర్చకు కూర్చుందాం అని ఆయన సవాల్ విసిరారు. నువ్వు చేసిన ఆరోపణలు నిజమని తేలితే నేను రాజీనామాకు సిద్ధం అని అన్నారు. నిరూపించ లేకపోతే నువ్వు రాజీనామాకు సిద్ధమా అని సవాల్ చేసారు.

ఆంధ్రప్రదేశ్ లో  బి జె పి హిందూ మతంను  అడ్డు పెట్టుకొని పైకి రావాలని చూస్తుంది  అని ఆరోపించారు. శ్రీశైలంలో ముస్లింలను వెళ్లగొట్టడానికి మేము ఎవరు అని ప్రశ్నించారు. 40 సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు నివసిస్తున్నారు అని, సుప్రీంకోర్టు నుంచి కూడా ఆర్డర్లు తెచ్చుకున్నారు అని వ్యాఖ్యానించారు. రజాక్ అనే వ్యక్తి నలభై సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు అని, నేను తొమ్మిది సంవత్సరాల నుంచి మాత్రమే రాజకీయాల్లో ఉన్నాను అతను నాకు బినామీ ఎలా అవుతాడు అతను పార్టీ కార్యకర్త మాత్రమే అని అన్నారు. అనవసర ఆరోపణలు చేస్తే మర్యాదగా ఉండదు అని హెచ్చరించారు. నా హిందుత్వం గురించి మఠాధిపతులు గాని, పీఠాధిపతులను అడిగితే తెలుస్తుంది అని ఆయన వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: