ఆంధ్రప్రదేశ్ లో కొంతమంది అధికారులు వైసీపీ ఎమ్మెల్యేలకు సహకరించడం లేదనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. నెల్లూరు జిల్లా వేంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారిన పరిస్థితి. ఆనం రాంనారాయణరెడ్డి ఎప్పటినుంచొ అధికారుల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. కనీసం కూడా తనకు అధికారులు సహకరించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అధికారులతో సఖ్యత కోసం ప్రయత్నాలు చేస్తున్న కొంతమంది మాటలు విని నన్ను దూరం పెడుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యేలు అధికారుల తీరు కారణంగా ముఖ్యమంత్రి జగన్ కూడా ఫిర్యాదు చేసే ప్రయత్నం చేసినా సరే అది సాధ్యం కాలేదు. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. కొంతమంది అధికారులు అయితే కనీసం అధికార పార్టీ ఎమ్మెల్యేల విషయంలో ప్రోటోకాల్ కూడా పాటించకపోవడంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు నానా అవస్థలు పడుతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొంతమంది అధికారులు వ్యవహరించిన తీరుపై ఆనం రామనారాయణ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ విమర్శలు చేసిన పరిస్థితి చూసి కూడా అధికారులు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉండవచ్చు.

నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం కొంత మంది ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరు జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక మంత్రి కూడా అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఆనం రాంనారాయణ రెడ్డిని పక్కన పెట్టారని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ నేతలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. అధికారులు కూడా ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలలో తల దూరిస్తే మాత్రం అనవసరంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న పెద్ద ఆశ్చర్యం లేదు అని చెప్పాలి. రాజకీయాలకు అధికారులు దూరంగా ఉండాల్సిన తరుణంలో కొంతమంది చెప్పిన మాటలు విని ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టడం అనేది ఎంతమాత్రం భావ్యం కాదని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: