రాజ‌కీయాల్లో వెయిట్ చేసే ఓపిక ఉంటే.. నాయ‌కుల‌కు ఎక్క‌డో ఒక్క చోట‌.. ఎప్పుడొ ఒక‌ప్పుడు ప‌ద‌వులు ద‌క్క‌క పోతాయా? అంటున్నారు గుంటూరు జిల్లా రాజ‌కీయ నాయ‌కులు. ఇక్క‌డ కాంగ్రెస్ పార్టీ కార్పొరేష‌న్‌పై గ‌ట్టి ప‌ట్టుతో ఉన్న రోజుల్లో మేయ‌ర్ పీఠానికి మంచి డిమాండ్ ఉంది. ఈ క్ర‌మంలో జిల్లాలో కీల‌క నాయ‌కులై న రాయ‌పాటి సాంబ‌శివ‌రావు, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌లు.. మేయ‌ర్ పీఠం కోసం పోటా పోటీ రాజ‌కీయాలు చేసుకునేవారు. అలాంటి రోజుల్లో ఇక్క‌డ మేయ‌ర్ పీఠంపై క‌న్నేశారు.. కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు.

కాంగ్రెస్‌లో బొత్స స‌త్య‌నారాయ‌ణ శిష్యుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కావ‌టి.. 2005లో జ‌రిగిన గుంటూరు కార్పొ రేష‌న్ ఎన్నిక‌ల్లో కార్పొరేట‌ర్‌గా విజ‌యం సాధించి.. మేయ‌ర్ అభ్య‌ర్థిగా కావ‌టి పేరు వినిపించినా.. త‌ర్వాత రాయ‌పాటి, క‌న్నాల వ్యూహం ముందు.. కావ‌టి తేలిపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత .. కూడా ప‌రిస్థితి అనుకూలిం చ‌లేదు. ఈ నేప‌థ్యంలోనే రాష్ట్ర విభ‌జ‌న‌తో.. కాంగ్రెస్ కుప్ప‌కూలిపోయి.. బొత్స అడుగు జాడ‌ల్లో కావ‌టి మనో హ‌ర్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు గుంటూరు మేయ‌ర్ పీఠంపై ఆయ‌న ఆశ‌లు పెట్టుకున్నారు.

ప్ర‌స్తుతం కావ‌టి మ‌నోహ‌ర్ నాయుడు 20వ డివిజన్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్నారు. వైసీపీకి బ‌లం ఎక్కువ‌గా ఉండ‌డం.. పైగా బొత్స శిష్యుడిగా కావ‌టికి మంచి గుర్తింపు ఉండ‌డం, వివాద‌ర‌హితుడు కావ‌డంతో ఆయ‌న‌కే మేయ‌ర్ పీఠం ద‌క్కుతుందని అంటున్నారు. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీ అధినేత జ‌గ‌న్ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. ఇదిలావుంటే.. వైసీపీలో కీల‌క‌నాయ‌కుడు.. వైవీ సుబ్బారెడ్డి కూడా బొత్స‌కు అనుకూలంగానే ఉన్నార‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం గుంటూరు రాజ‌కీయాల‌పై.. వైవీ సుబ్బారెడ్డి కూడా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నందున‌.. బొత్స అనుకూలుడైన కావ‌టికి మేయ‌ర్ పీఠం దాదాపు ద‌క్కే ఛాన్స్ ఉంద‌ని తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: