కేంద్రంలోని మోడీ సర్కారుతో ఏపీలోని జగన్ సర్కారు ఆరంభం నుంచి సఖ్యతగానే ఉంటోంది. కేంద్రంలో చేరకపోయినా అనధికార మిత్రపక్షంగా రాజకీయ సాగిస్తోంది. బీజేపీకి అవసరమైన సమయంలో రాజ్యసభలో మద్దతు ఇస్తూ వస్తోంది. కానీ ఇప్పుడు మొదటిసారి విశాఖ ఉక్కు విషయంలో వైసీపీకి గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. కేంద్రంతో పోరాడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.


అందుకే రాజ్యసభలో దాదాపు మొదటిసారి వైసీపీ వాకౌట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ యత్నాలను నిరసిస్తూ రాజ్యసభలో గనులు, ఖనిజాల సవరణ బిల్లుపై జరుగుతున్న చర్చ నుంచి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాకౌట్ చేశారు. వేలాది కార్మికులు, ఉద్యోగుల దశాబ్దాల కష్టంతో నవరత్న సంస్థగా భాసిల్లుతున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని congress PARTY' target='_blank' title='వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంత మాత్రం సమర్ధించబోదని ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో వాకౌట్‌కు ముందు  స్పష్టం చేశారు.


రాజ్యసభలో గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడారు. నష్టాలలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల పునఃవ్యవస్థీకరణ, పునరుద్దరణ, పునరుజ్జీవనానికిక అవసరమైన ప్రణాళిక, చర్యలను రూపొందించడానికి బదులుగా వాటిని ప్రైవేటీకరించి చేతులు దులుపుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని ఆయన  తప్పుబట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలు తమపై ఉంచిన సామాజిక బాధ్యతను నెరవేర్చే దిశలో పనిచేస్తాయని... తద్వారా లక్షలాది మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని విజయసాయిరెడ్డి అన్నారు.


ప్రైవేట్‌ రంగ సంస్థలు కొంత మేర ఉపాధి కల్పించినా లాభార్జనే ఏకైక ధ్యేయంగా కంపెనీలను నడుపుతాయన్నారు విజయసాయి. ప్రభుత్వ రంగ సంస్థలకు గనుల కేటాయింపు సంపూర్ణంగా జరిగిన తర్వాతే మిగిలిన గనులను ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న టన్ను ఖనిజానికి ఇంత మొత్తం రాయల్టీ మైనింగ్‌ లీజుదారుడు చెల్లించే నిబంధన స్థానంలో మైనింగ్‌ ఆదాయంలో ప్రభుత్వం వాటా పొందేలా ఈ బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదిస్తోందన్నారు. దీని వల్ల 50 మైనింగ్‌ బ్లాక్‌లు ప్రైవేట్‌ సంస్థల చేతుల్లోకి వెళ్తాయన్నారు. వాకౌట్ వరకూ బాగానే ఉంది. కానీ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వైసీపీ అడ్డుకోగలుగుతుందా.. వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: