స్టేట్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ పై ఒక ఏడాది లో 9 వేల కోట్లు అప్పులు తెచ్చారు అని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఈ అప్పు కోసం బ్యాంకులకు పూచికత్తు ఏం పెట్టారో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. అన్ని వివరాలు బయటకు వెల్లడి కావలసిన అవసరం ఉంది అని అన్నారు. అంతిమంగా ఈ అప్పుల భారం మోయ వలసింది ప్రజలే అని ఆయన పేర్కొన్నారు. విజయ సాయి రెడ్డి కేసుల పై  సిబిఐ ఉదాసీనత ప్రదర్శిస్తోంది అని  అంటు  సోషల్ మీడియా లో రకరకాల కథనాలు వస్తున్నాయి అన్నారు.
 
 సిబిఐ ఉదాసీనత గురించి ప్రజలు అలా అనుకోవడం లో తప్పు ఏమీ లేదు అని ఆయన వ్యాఖ్యానించారు. మా ముఖ్యమంత్రి గారూ  గతంలో ప్రతిపక్ష నాయకుడు గా ఉన్నప్పూడు  జగన్ మోహన్ రెడ్డి రోడ్ల పరిస్ఠితి గురించి మాట్లాడిన మాటలు వీడియో ప్రదర్శించిన రఘురామ కృష్ణంరాజు... రోడ్లు అప్పుడు బాగా లేవు ఇప్పుడు అసలు లేవు అంటూ ఎద్దేవా చేసారు. ఆనాడు జగన్ గారు చెప్పిన దానికంటే దారుణంగా అద్వాన్నంగా రోడ్లు ఉన్నాయని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు గాలిలో కాకుండ నేల మీద ప్రయాణాలు చేస్తే వాస్తవాలు తెలుస్తాయి అని సూచించారు.

దయచేసి సీఎం గారు  సంక్షేమ  పథకాలు తో పాటు అభివృద్ధిపై దృష్టి పెట్టాలి అని కోరారు.  కోర్టు లకు చెప్పి రాజధానిని విశాఖకు  తీసుకు వెళ్తా అని మంత్రి సత్తిబాబు ఎలా చెప్తారని ఆయన ప్రశ్నించారు. నూటికి నూరు శాతం అమరావతి రాజధానిగా ఉంటుంది అన్నారు. అమరావతి అంశం పై హైకోర్టులో స్టే ఉన్నప్పుడు రాజధాని ఎలా మారుస్తారు అని ఆయన ప్రశ్నించారు. మనం న్యాయ దేవతను నమ్ముకున్నామని మహిళలు, రైతులు ఎవరూ ఆధైర్య పడకండి అని సూచించారు. మంత్రి బొత్స సత్యనారాయణ , జగన్ గారి కలలు కలలు గానే మిగిలి పోతాయన్నారు. ఈ.డి కేసులను విచారిస్తామని  సిబిఐ, హైకోర్టు కూడా చెప్పింది అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: