బొత్స సత్యనారాయణ...ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఈయనే కీలకం అయినట్లు కనిపిస్తోంది. సి‌ఎం జగన్ మోహన్ రెడ్డి, ఫ్యామిలీతో కలిసి సిమ్లా టూర్‌కు వెళ్ళిన విషయం తెలిసిందే. ఇక వైసీపీలో నెంబర్ 2గా ఉండే విజయసాయిరెడ్డి కూడా రాష్ట్రంలో లేరు. ఈ పరిస్తితుల్లో బొత్స సత్యనారాయణ లీడ్ తీసుకున్నట్లు కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ మంత్రిగా బొత్సదే ఇప్పుడు పెత్తనమని అంటున్నారు.

అందుకే ఈ మధ్య కాలంలో బాగా సైలెంట్‌గా ఉన్న బొత్స సడన్‌గా జగన్ టూర్‌కు వెళ్ళగానే పోలిటికల్ స్క్రీన్‌పై హడావిడిగా కనిపిస్తున్నారు. పైగా సంచలన నిర్ణయాలతో బొత్స అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రాజధాని అంశంపై బొత్స సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడప్పుడు మీడియా ముందుకొస్తు మూడు రాజధానులు ఖచ్చితంగా అమలు చేస్తామని చెబుతూ వస్తున్నారు.

తాజాగా కూడా ఇదే తరహాలో కామెంట్లు చేస్తూ వచ్చారు. సరే బొత్స మాటలు ఏమి కొత్త కాదనే చెప్పొచ్చు. కానీ ఇక్కడే పెద్ద ట్విస్ట్ వచ్చి పడింది. మరి బొత్స కావాలని మాట్లాడారో, కంగారులో మాట్లాడారో తెలియదు గానీ...అమరావతి రైతులతో చర్చించాల్సిన అవసరం లేదని అనేశారు. ఏదైనా అంశం ఉంటే చర్చలు చేయాలని, తాము చేస్తుంది జరగాలంటే చర్చేంటి? అని అన్నారు. అలాగే కొన్ని గ్రామాలకో, ఓ సామాజిక వర్గానికో న్యాయం చేయడం కాదంటూ మాట్లాడారు. దీంతో అమరావతి రైతులు భగ్గుమంటున్నారు. బొత్స తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే బొత్స వ్యాఖ్యలపై టి‌డి‌పి నేతలు కూడా ఫైర్ అవుతున్నారు. రాజధానిపై బొత్స వ్యాఖ్యలు సరికావని అంటున్నారు. రాజధాని ఎక్కడకు వెళ్లదని మాట్లాడుతున్నారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు సైతం, బొత్సపై ఫైర్ అవుతున్నారు. అయితే బొత్స రాజధాని అంశంలో మరొకసారి వివాదం సృష్టించినట్లే కనబడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అంశం అమరావతికి దగ్గరగా ఉన్న జిల్లాల్లో ప్రభావం ఎక్కువ చూపే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. చూడాలి మరి ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో?  

మరింత సమాచారం తెలుసుకోండి: