రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన మాత్ర‌మే జ‌రిగింది.. కానీ, కొంద‌రు ఆంధ్ర నాయ‌కుల మ‌న‌సంతా హైద‌రాబాద్‌లోనే ఉంద‌ని తెలుస్తోంది. అప్ప‌ట్లో రాష్ట్ర విభ‌జ‌న ఆగాల‌ని కోరుకోలేద‌ని, హైద‌రాబాద్ త‌మ‌కు వ‌స్తే చాల‌ని లేదా హైద‌రాబాద్‌పై పెత్త‌నం రెండు రాష్ట్రాల‌కు ఉండాల‌ని భావించార‌ని తెలుస్తోంది. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఏంటంటే ఆంధ్ర ప్ర‌దేశ్‌కు చెందిన నాయ‌కులు, పారిశ్రామిక వేత్త‌ల ఆస్తుల‌న్ని హైద‌రాబాద్‌లోనే ఉన్నాయి. తాజాగా ఆంధ్ర ప్ర‌దేశ్ కేబినెట్ మంత్రి స్థాయిలో ఉన్న ఓ నాయ‌కుడు ఒక‌రు ఇటీవ‌ల హైద‌రాబాద్ ఓ విలాస‌వంత‌మైన భ‌వ‌నం కొనుకున్నార‌నేది చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.
 

   అలాగే, ఆంధ్ర‌వారికి క‌రోనా వ‌స్తే హైద‌రాబాద్‌లో ఉన్న హాస్పిట‌ల్స్‌కు లైన్ క‌డుతున్నారు. రాష్ట్రం విడిపోక ముందు 70 ఏళ్ల‌లో కొంద‌రు నాయ‌కులు అక్క‌డి వ‌న‌రుల‌ను తీసుకొచ్చి హైద‌రాబాద్‌లో కేంద్రీక‌రించార‌ని పెట్టార‌నే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. అలాగే.. ఆంధ్ర‌లో ఉన్న డాక్ట‌ర్లు, పెద్ద వ్యాపారులు కూడా హైద‌రాబాద్‌లో సెటిల్ అయ్యి అక్క‌డి ప్రాంతానికి అన్యాయం చేశార‌నే మాట వ‌స్తోంది. ఇప్ప‌టికీ వాళ్ల‌కు హైద‌రాబాద్‌పై అదే ప్రేమ ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.


     ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ఉన్న అగ్ర నాయ‌కులుగా ఉన్న అన్ని పార్టీల‌కు సంబంధించి.. అటు టీడీపీ, వైసీపీ , జ‌న‌సేన‌కు సంబంధించి గానీ ప్ర‌ముఖ నాయ‌కుల ఆస్తుల‌న్ని హైద‌రాబాద్‌లో ఉన్నాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే, ఆంధ్ర ప్ర‌దేశ్‌కు ట్యాక్స్ క‌ట్ట‌కుండా తెలంగాణ ప్ర‌భుత్వానికి ఆంధ్ర పాల‌కులు ట్యాక్స్ క‌డుతున్నార‌నేది అక్క‌డి ప్ర‌జ‌ల్లో అస‌హ‌నం క‌లిగిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.



 అలాగే, ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి చెందిన భార‌తీ సిమెంట్‌, సాక్షీ మీడియాను ఆంధ్ర‌కు ఎందుకు తేవ‌డం లేద‌నే ప్ర‌శ్న త‌లెత్తుతుంది. అలాగే, చంద్ర‌బాబు కు చెందిన హెరిటేజ్ ప్ర‌ధాన కేంద్రం కూడా హైద‌రాబాద్‌లో నే ఉంది.  ఈ క్ర‌మంలో తెలంగాణ‌లో ఉన్న ఆంధ్ర నాయ‌కుల ఆస్తులు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తీసుకువ‌చ్చేందుకు కృషి చేయాల‌ని అక్క‌డి రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

 
   

మరింత సమాచారం తెలుసుకోండి:

hyd