
అలాగే, ఆంధ్రవారికి కరోనా వస్తే హైదరాబాద్‌లో ఉన్న హాస్పిటల్స్‌కు లైన్ కడుతున్నారు. రాష్ట్రం విడిపోక ముందు 70 ఏళ్లలో కొందరు నాయకులు అక్కడి వనరులను తీసుకొచ్చి హైదరాబాద్‌లో కేంద్రీకరించారని పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే.. ఆంధ్రలో ఉన్న డాక్టర్లు, పెద్ద వ్యాపారులు కూడా హైదరాబాద్‌లో సెటిల్ అయ్యి అక్కడి ప్రాంతానికి అన్యాయం చేశారనే మాట వస్తోంది. ఇప్పటికీ వాళ్లకు హైదరాబాద్‌పై అదే ప్రేమ ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఆంధ్ర ప్రదేశ్‌లో ఉన్న అగ్ర నాయకులుగా ఉన్న అన్ని పార్టీలకు సంబంధించి.. అటు టీడీపీ, వైసీపీ , జనసేనకు సంబంధించి గానీ ప్రముఖ నాయకుల ఆస్తులన్ని హైదరాబాద్‌లో ఉన్నాయని అందరికీ తెలిసిందే. అయితే, ఆంధ్ర ప్రదేశ్‌కు ట్యాక్స్ కట్టకుండా తెలంగాణ ప్రభుత్వానికి ఆంధ్ర పాలకులు ట్యాక్స్ కడుతున్నారనేది అక్కడి ప్రజల్లో అసహనం కలిగిస్తున్నట్టుగా తెలుస్తోంది.