తెలుగు రాష్ట్రాల విభజన కు ముందు పరిస్థితులు వేరుగా ఉండేవి. అప్పుడు రాజశేఖరరెడ్డి వైఎస్ అధికారంలో ఉన్నారు. ఆయన పాదయాత్రలో ఎన్నో కష్టాలు పడి మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ ను భారీ మెజారిటీ తో గెలిపించారు. అప్పటి నుండి ఆయన మార్క్ పాలన కొనసాగింది. ప్రజల కష్టాలు పాదయాత్రలో స్పష్టంగా దగ్గరగా చూసిన ఆయన వాటి పరిష్కారానికి సరైన మార్గాలు కూడా కనిపెట్టారు. ఈ సమస్యలన్నిటికీ తన మేనిఫెస్టో ద్వారా పరిష్కారాలు చూపారు. అధికారం లోకి రాగానే ప్రతి పధకం తూచాతప్పకుండా అమలు కూడా చేశాడు. దీనితో కాంగ్రెస్ మరోసారి ఊపిరి పోసుకుంది. కానీ అనంతర పరిస్థితులలో ఆయన దూరం కావడం,  కొత్త ప్రభుత్వ నిర్లక్ష్యం తో ఈ పధకాలు అనుకున్నంతగా ప్రజలను చేరలేకపోయాయి.

ఇంతలో కాంగ్రెస్ తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి, తాను ఒక్క రాష్ట్రంలో కూడా లేకుండా కరువైపోయింది. అంటే ఆ పార్టీ ఇక ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా కనిపించకుండా పోయింది. కాంగ్రెస్ ఆయా ఎన్నికలలో వైఎస్ అభిమానులను కదిలించినప్పటికీ వారి స్పందన మాత్రం శూన్యం. అందుకే ఒక్క చోట కూడా సరిగ్గా లేకుండా దాదాపు దేశంలో కూడా ఆ పార్టీ కనిపించకుండా పోయింది.  ఇలాంటి పరిస్థితిలో తెలంగాణలో వైఎస్ అభిమానులు కాంగ్రెస్ వైపు ఉండటం, అలా అనుకోవడం కూడా సాధ్యం కానీ పని. అంటే ఎస్ అభిమానులను కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది.  

కానీ రెండు రాష్ట్రాలలో రెండు ప్రభుత్వాలు వెలిశాయి. ఒకదానిలో వైఎస్ జగన్ మోహన్ అధికారంలోకి వస్తే, తెలంగాణాలో మాత్రం తెరాస అధినేత  కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఏపీలో జగన్ వైపుకు వైఎస్ అభిమానులు తిరిగారు అనేదానిపై స్పష్టత లేకున్నా తనుకూడా తండ్రి బాటలో అడుగులు వేస్తున్నట్టు చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ తన ఖాతాలో వైఎస్ అభిమానులను వేసుకునే  ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదు. అందుకే వైఎస్ షర్మిల కొత్త పార్టీతో వచ్చినప్పటికీ వైఎస్ఆర్ అభిమానులు ఆమెను గెలిపిస్తారు అనే నమ్మకం పెట్టుకోవడం అనవసరమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ysr