
ఇంతలో కాంగ్రెస్ తెలంగాణ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించి, తాను ఒక్క రాష్ట్రంలో కూడా లేకుండా కరువైపోయింది. అంటే ఆ పార్టీ ఇక ఇరు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడా కనిపించకుండా పోయింది. కాంగ్రెస్ ఆయా ఎన్నికలలో వైఎస్ అభిమానులను కదిలించినప్పటికీ వారి స్పందన మాత్రం శూన్యం. అందుకే ఒక్క చోట కూడా సరిగ్గా లేకుండా దాదాపు దేశంలో కూడా ఆ పార్టీ కనిపించకుండా పోయింది. ఇలాంటి పరిస్థితిలో తెలంగాణలో వైఎస్ అభిమానులు కాంగ్రెస్ వైపు ఉండటం, అలా అనుకోవడం కూడా సాధ్యం కానీ పని. అంటే ఎస్ అభిమానులను కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకోలేకపోయింది.
కానీ రెండు రాష్ట్రాలలో రెండు ప్రభుత్వాలు వెలిశాయి. ఒకదానిలో వైఎస్ జగన్ మోహన్ అధికారంలోకి వస్తే, తెలంగాణాలో మాత్రం తెరాస అధినేత కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఏపీలో జగన్ వైపుకు వైఎస్ అభిమానులు తిరిగారు అనేదానిపై స్పష్టత లేకున్నా తనుకూడా తండ్రి బాటలో అడుగులు వేస్తున్నట్టు చూస్తూనే ఉన్నాం. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ తన ఖాతాలో వైఎస్ అభిమానులను వేసుకునే ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదు. అందుకే వైఎస్ షర్మిల కొత్త పార్టీతో వచ్చినప్పటికీ వైఎస్ఆర్ అభిమానులు ఆమెను గెలిపిస్తారు అనే నమ్మకం పెట్టుకోవడం అనవసరమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.