2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీలో అనేక మార్పులు వచ్చాయి. పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో, ఆ ఓటమి నుంచి బయటపడేసేందుకు అధినేత చంద్రబాబు గట్టిగానే కష్టపడ్డారు. అలాగే పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇదే క్రమంలో పార్టీ నాయకత్వాన్ని బలపడేలా చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇదే క్రమంలో ఎప్పుడూ ఉండే జిల్లాల అధ్యక్షులని తీసేసి.....పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. 25 పార్లమెంట్ స్థానాలకు 25 మంది అధ్యక్షులని పెట్టారు.

అయితే ఈ పార్లమెంట్ అధ్యక్షులని నియమించి ఏడాది దాటేసింది. మరి ఏడాది దాటేసిన ఈ పార్లమెంట్ అధ్యక్షులు వారి వారి స్థానాల్లో ఏమైనా మార్పులు తీసుకొచ్చారా? పార్టీని బలోపేతం చేశారా? అంటే కొంతమంది మంచిగానే పనిచేస్తున్నా....కొంతమంది మాత్రం పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేయడం లేదు. ఎలాగో పార్టీ పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో చిత్తుగా ఓడింది. రాష్ట్ర వ్యాప్తంగా అదే పరిస్తితి. అయితే ఇందులో అధికార బలం ఎక్కువగా ఉండటంతో వైసీపీ విజయం సాధించింది అనుకోవచ్చు.

కాకపోతే టి‌డి‌పి తప్పిదాల వల్ల కూడా కొంత వైసీపీకి ప్లస్ అయింది. పలువురు టి‌డి‌పి నేతలు ఎఫెక్టివ్‌గా పనిచేయడం లేదు. కొన్ని పార్లమెంట్ స్థానాల్లో నేతలు అనుకున్న మేర పనిచేయడం లేదు. అంత ఎఫెక్టివ్ గా పనిచేయని పార్లమెంట్ అధ్యక్షుల్లో అరకు-గుమ్మడి సంధ్యారాణి, అమలాపురం-రెడ్డి అనంత కుమారి, నరసాపురం-తోట సీతారామ లక్ష్మీ, మచిలీపట్నం-కొనకళ్ళ నారాయణరావు, గుంటూరు-తెనాలి శ్రావణ్ కుమార్, తిరుపతి-నరసింహ యాదవ్, చిత్తూరు-పులివర్తి నాని లాంటి వారు ఉన్నారు.

అయితే ఇంకొందరు అధ్యక్షులు కూడా అనుకున్న మేర పనులు చేయడం లేదు. కాకపోతే వీరి మీద బెటర్ అనిపిస్తున్నారు. తమ పార్లమెంట్ స్థానాల్లో పర్యటిస్తూ పార్టీని పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు మాత్రం పూర్తిగా చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. ఇలాంటి వారిని చంద్రబాబు మార్చి, సత్తా ఉన్న నాయకులకు అవకాశం ఇస్తే బెటర్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: