కొన్ని సార్లు మెడికల్ చరిత్రలోనే అద్భుతాలు జరుగుతూ ఉంటాయట. వాస్తవంగా ఈ మాటలు మనము సినిమాలలో తరచూ వింటూ ఉంటాము. కానీ ఇప్పుడు నిజజీవితంలోనే ఒక మెడికల్ మిరాకిల్ జరిగింది. అసలు విషయం ఏమిటో ఒకసారి చూద్దాం. అది 1951 వ సంవత్సరం అమెరికాకు చెందిన ఒక మహిళ గర్భాశయం కాన్సర్ సోకడంతో కొంతకాలం హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ మరణించింది. అయితే ఈమెకు చికిత్స అందిస్తున్న సమయంలోనే ఈమె శరీరం నుండి ఆమె అనుమతి తీసుకోకుండా "హెలా" కణాలను తీసుకోవడం జరిగింది. అయితే ఈ కణాలను అలాగే భద్రపరిచారు. అవి ఆ తర్వాత అమర సెల్ లైన్ గా మారిపోవడంతో ఆశ్చర్యపోవడం డాక్టర్ల వంతయింది.

ఈ కణాలు పోలియో, హెచ్ ఐ వి, కరోనా వైరస్ మరియు కాన్సర్ లాంటి ప్రమాదకరమైన దీర్ఘకాలిక వ్యాధులకు నివారణకు ఉపయోగపడనున్నాయి. అయితే ఆ మహిళ హెన్రిట్టా లాక్స్ యొక్క వివరాలను ఇంత కాలం గ్లోబల్ సైంటిఫిక్ కమ్యూనిటీ దాచిపెట్టింది. అయితే ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ విషయాన్ని బట్టబయలు చేసింది. ఇది గ్లోబల్ సైంటిఫిక్ కమ్యూనిటీ చేసిన పెద్ద తప్పు అని చెప్పింది. అయితే WHO హెన్రిట్టా లాక్స్ ను WHO డైరెక్టర్-జనరల్ అవార్డు ను ఇచ్చి గౌరవించారు. ఈ విషయాన్ని డాక్టర్ టెడ్రోస్ తెలిపారు. అయితే ఈ అవార్డును హెన్రిట్టా తరపున ఆమె కొడుకు లారెన్స్ లాక్స్ (87) జెనీవా లో తీసుకోవడం జరిగింది. ఈమెకు సంబంధించి చివరిగా తెలిసిన వ్యక్తి లారెన్స్ ఒక్కరే. ఈ విషయం గురించి లారెన్స్ ఎంతో సంతోషంగా ఆమెను గుర్తు చేసుకున్నారు. మా తల్లి ద్వారా ఈ ఉపయోగం జరిగినందుకు గర్వంగా ఉందన్నారు.

ఇతరులు బ్రతకడానికి ఒక మార్గం చూపిన దేవత మా అమ్మ అని పెద్ద కొడుకు సీనియర్ లారెన్స్ అన్నారు. గత సంవత్సరం లోపు ఈమె కణాల వలన తయారుచేయబడ్డ HPV వ్యాక్సిన్ లు ఎంతో మంది తక్కువ ఆదాయం ఉన్న దేశాలలోని ప్రజలు పొందగలిగారు. ముఖ్యంగా ఈ HPV వ్యాక్సిన్ హెన్రిట్టా కానాల ద్వారా తయారుచేయబడింది. అది ఇప్పుడు లక్షల మందికి ప్రాణాలు పోస్తోంది.  అయితే హెన్రిట్టా ఈ కాన్సర్ మూలంగా ఎంతో నరకవేదనను అనుభవించింది. అప్పట్లో దీనికి చికిత్స ఉన్నప్పటికీ అంత స్తోమత లేకుండా పోయింది. ఈమె చనిపోయే నాటికీ వయసు కేవలం 31 సంవత్సరాలు. నిజంగా ఇది ఒక చరిత్ర అని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: