ఈ మ‌ధ్య కాలం రెండు తెలుగు రాష్ట్రాల‌లో మ‌త్తు ప‌దార్థాల అమ్మాకాల‌కు సంబంధించిన వార్త‌లు ఎక్కువ గా వింటున్నాం. ప్ర‌స్తుతం మ‌త్తు ప‌దార్థాల స‌మస్య కేవ‌లం మ‌న తెలుగు రాష్ట్రాలే కాకుండా యావ‌త్ దేశాన్ని ప‌ట్టి పీడిస్తున్న అతి పెద్ద స‌మ‌స్య‌. మ‌త్తు ప‌దార్థాల వ‌ల లో చిక్కి చాలా మంది యువ‌కులు మ‌త్తు ప‌దార్థాల‌కు అల‌వాటు ప‌డుతున్నారు. అందు వ‌ల్ల త‌మ భ‌విష్య‌త్తు ను కోల్పొతున్నారు. అలాగే ఈ మ‌త్తు ప‌దార్థాల వాడ‌కం పెర‌గ‌డం తో మ‌నుషుల లో హింస భావ‌న కూడా పెరుగుతుంది. దీంతో దేశంలో క్రైమ్ రేట్ రోజు రోజు కు పెరిగి పోతుంది. అలాగే అమ్మాయి ల‌పై కూడా ఆఘాయిత్యాలు పెరిగి పోతున్నాయి. ఇవి జ‌ర‌గ‌డానికి ఈ డ్ర‌గ్స్ కూడా ఒక కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. ముఖ్యం మ‌న తెలుగు రాష్ట్రాల‌లో గంజాయి వాడ‌కం పెరిగిన నాటి నుంచి ఇలాంటి ఆఘాయిత్యాలు ఎక్కువ గా జ‌రుగుతున్నాయి.



అయితే మ‌న తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మత్తు మందు ల‌కు చాలా మంది యువ‌కులు బానిస‌లు అవుతున్నారు. వాటి కోసం అధిక మొత్తం లో డ‌బ్బులు ఖ‌ర్చు చేస్తున్నారు. వారి వ‌ద్ద డ‌బ్బులు లేకుంటే యువకులు అప్పులు చేస్తున్నారు. అప్పు చేసినా మ‌త్తు మందు ను కొని సేవిస్తున్నారు. ముఖ్యం గా మ‌న తెలుగు రాష్ట్రాల‌లో గంజాయి వాడ‌కం రోజు రోజు కు పెరిగి పోతుంది. గంజాయి సాగు ను, వాడ‌కాన్ని త‌గ్గించ‌డానికి రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాలు తీవ్రం గా శ్ర‌మిస్తున్నాయి. అలాగే పోలీసులు కూడా వీటి వాడ‌కాన్ని త‌గ్గించ‌డానికి చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. గంజాయి వాడ‌కం వ‌ల్ల వ‌చ్చే న‌ష్టల గురించి ప్ర‌జ‌ల‌కు యువ‌కులు వివ‌రిస్తున్నారు. అయినా యువ‌కులు మ‌త్తు ప‌దార్థాల వాడ‌కాన్ని ఏ మాత్రం త‌గ్గించ‌డం లేదు. అంతే కాకుండా వీటిన కొను గోలు చేయ‌డానికి అప్పులు చేస్తున్నారు. అలాగే కొన్ని ప్రాంతాలలో యువ‌కులు దొంగ‌త‌నాల‌కు కూడా పాల్పడుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: