
మండలిలో వైసీపీ బలమే ఉండనుంది. దీంతో ఇప్పుడు మండలి ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ లను ఎంపిక చేయాలి. దీంతో జగన్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది. జగన్ అన్ని పదవుల భర్తీలో క్యాస్ట్ ఈక్వేషన్లే ప్రధానంగా చూస్తున్నారు. ఈ క్రమంలోనే శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులు కూడా కేబినెట్ ర్యాంకు కావడంతో పార్టీలో ఆ శావాహులు ఈ పదవుల కోసం తమ స్థాయిలో అయితే లాబీయింగ్ చేస్తున్నారట.
అయితే జగన్ మాత్రం వీటికి తలొగ్గరు. మండలి చైర్మన్ గా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజును ఎంపిక చేసే అవకాశముందని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. మండలి లో దళితులకు ప్రాధాన్యం ఇవ్వాలనే జగన్ ఈ నిర్ణయం తీసుకో బోతున్నారట. ఇక డిప్యూటీ చైర్మన్ మైనారిటీలకు ఇచ్చే అవకాశముంది. గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ పదవిని మైనార్టీ లకే ఇవ్వడంతో ఇప్పుడు జగన్ సైతం ఈ పదవిని మైనార్టీ లకే ఇస్తే కుల సమీకరణలు మ్యాచ్ చేసినట్టు అవుతుందని జగన్ భావిస్తున్నారట.