ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌ద‌వుల భ‌ర్తీ లో ఎన్ని ఈక్వేష‌న్లు.. క్యాలిక్యులేష‌న్లు వేసుకుంటారో అనే దాని గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ క్ర‌మంలో నే ఏపీ లో ఒకే సారి ఏకంగా 14 ఎమ్మెల్సీ ప‌ద‌వుల భ‌ర్తీ జ‌రుగుతోంది. దీంతో అధికార వైసీపీ లో ఇప్పుడు పెద్ద కోలాహాలం నెల‌కొంది. ఈ నెల 17 వ తేదీ నుంచి శాస‌న‌స భ తో పాటు శాస‌న మండ‌లి స‌మావేశాలు కూడా జ‌ర‌గ నున్నాయి. ఈ లోగానే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ను ఎన్ను కోవాల్సి ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఛైర్మన్ గా ఉన్న షరీఫ్ పదవీ కాలం ముగిసింది. దీంతో ఇప్పుడు కొత్త ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ ను ఎన్నుకోవాలి.

మండ‌లిలో వైసీపీ బ‌ల‌మే ఉండ‌నుంది. దీంతో ఇప్పుడు మండలి ఛైర్మన్, వైఎస్ ఛైర్మన్ లను ఎంపిక చేయాలి. దీంతో జగన్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది ఆసక్తిగా మారింది. జ‌గ‌న్ అన్ని ప‌ద‌వుల భ‌ర్తీలో క్యాస్ట్ ఈక్వేష‌న్లే ప్ర‌ధానంగా చూస్తున్నారు. ఈ క్ర‌మంలోనే శాసనమండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్ పదవులు కూడా కేబినెట్ ర్యాంకు కావడంతో పార్టీలో ఆ శావాహులు ఈ ప‌ద‌వుల కోసం త‌మ స్థాయిలో అయితే లాబీయింగ్ చేస్తున్నార‌ట‌.

అయితే జ‌గ‌న్ మాత్రం వీటికి త‌లొగ్గ‌రు.  మండ‌లి  చైర్మ‌న్ గా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కొయ్యే మోషేన్ రాజును ఎంపిక చేసే అవకాశముందని ఆ పార్టీ  నేత‌లు చెపుతున్నారు. మండ‌లి లో ద‌ళితుల‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌నే జ‌గ‌న్ ఈ నిర్ణ‌యం తీసుకో బోతున్నార‌ట‌. ఇక డిప్యూటీ చైర్మ‌న్ మైనారిటీలకు ఇచ్చే అవకాశముంది. గత తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ ప‌ద‌విని మైనార్టీ ల‌కే ఇవ్వ‌డంతో ఇప్పుడు జ‌గ‌న్ సైతం ఈ ప‌ద‌విని మైనార్టీ ల‌కే ఇస్తే కుల స‌మీక‌ర‌ణ‌లు మ్యాచ్ చేసిన‌ట్టు అవుతుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నార‌ట‌.

 

మరింత సమాచారం తెలుసుకోండి: